అమ్మ ఒడికి 75శాతం హాజరు నుండి మినహాయించండి - బీటీఏ
అమ్మ ఒడి పథకానికి హాజరు 75 శాతం ఉండాలన్న నిబంధనను ఎత్తేయాలని బీటీఏ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పల్లం రామచంద్ర డీఈవో గారికి వినతిపత్రం అందజేశారు.ఈ రోజు అన్నమయ్య జిల్లా నూతన డిఈవో రాఘవరెడ్డి ని మర్యాద పూర్వకంగా బీటీఏ నాయకులతో కలిసి సన్మానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వలసలు కరోనా కారణంగా పాఠశాలలో హాజరు శాతం తగ్గిందని ఈ విషయం ప్రభుత్వానికి నేతలకు తెలుసని ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని హాజరు నిబంధన ఎత్తేసి అందరికీ అమ్మ ఒడిని వర్తి0పజేయాలన్నారు.
డిఈవో ఈ విషయం పై స్పందిస్తూ ముఖ్యమంత్రి గతంలో పాఠశాలలకు పిల్లలను పంపడం తల్లిదండ్రుల ఇష్టా ఇష్టాలపై ఆధారపడి ఉంటుందని వ్యాఖ్యానించిన దృష్ట్యా హాజరుతో సంబంధం లేకుండా అందరికీ అమ్మ ఒడి ఈ సంవత్స రానికి ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ జిల్లా అధ్యక్షుడు అబ్బవరం హరిబాబు కార్యదర్శి భాస్కరయ్య రాయచోటి చిన్న మండెం అధ్యక్షులు వెంకటసుబ్బయ్య ,రాజశేఖర్ లు పాల్గొన్నారు.
Comments