ప్రొద్దుటూరు మునిసిపల్ కార్యాలయంలోని చైర్మన్ ఛాంబర్ నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, అమృత్ పథకం ఓ యజ్ఞంలా తలపెట్టి ప్రొద్దుటూరు ప్రజల దాహార్తి తీర్చటానికి మైలవరం డ్యామ్ నుండి నూటా ఇరవై కోట్ల రూపాయల వ్యయంతో ఇరవై నాలుగు కిలోమీటర్ల పైప్ లైన్ నిర్మించి, పట్టణ ప్రజల త్రాగునీటి సమస్యను వైదొలగించి ప్రొద్దుటూరు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి నిలువనున్నారని అభిప్రాయపడ్డారు.
కాగా టిడిపి ప్రభుత్వ హాయాంలో చుక్క నీరు నియోజకవర్గ ప్రజలకు ఇవ్వకపోగా కనీసం దాని గురించి ఆలోచన చేయలేదు అని ఆరోపించారు. నాడు నియోజకవర్గంలో టిడిపి ఇంచార్జి, మునిసిపల్ చైర్మన్ ఉన్నప్పటికీ, రాష్ట్రంలో టీడీపీ చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉంది కూడా ఇక్కడి ప్రజలను పట్టించుకోలేదని యెద్దేవాచేసారు. తమ వైసీపి ప్రభుత్వ హయాంలో మెగా కంపనీ ప్రతినిధులతో సంప్రదించి పనులు మొదలుపెట్టామని, ఇందులో భాగంగా వ్యయం అంచనా అయిన నూటా ఇరవై కోట్లలో ఇప్పటికే దాదాపు నూటా అయిదు కోట్లు చెల్లించామని అన్నారు.
త్వరలో అనగా డిసెంబర్ ముగింపు నాటికి ప్రజలకు మైలవరం డ్యామ్ నుండి త్రాగునీరు అందించే ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నట్లు ఆయన ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో నాయకుల, అధికారుల శ్రద్ధ, నిబద్దతతో పనులు ముందుకు సాగాయని, వైసీపీ అధికారం లోకి వచ్చిన తరువాత తన మొదటి భాధ్యతగా మంచి నీరు ప్రజలకు అందించటమే లక్ష్యంగా పనిచేశానని, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు నాటికి మంచి నీరు అందించటమే లక్షమంగా పని చేసామన్నారు. నేడు మునిసిపల్ కార్యాలయంలో అధికారుల, కాంట్రాక్టర్ రివ్యూ సమావేశం ఏర్పాటు చేయగా, ఇన్టేక్ వెల్ పనులు అయిదు శాతం మిగులు ఉండగా త్వరలో పూర్తి చేయనున్నట్లు, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనులు శరవేగంగా జరుగతున్నట్లు, ప్రొద్దటూరులోని అన్ని వాటర్ ట్యాంక్ లకు త్వరలో నీరు అందించనున్నట్లు తెలిపారు. ఇకపోతే మంచినీటి పైప్ లైన్ 22.5 కిలో మీటర్ల పనులు పూర్తి చేశామని, మిగులు 1.5 కిలో మీటర్ల పనులు మిగులగా, అధికారులకు కాంట్రాక్టర్ కు పనులు శరవేగంగా పనులు చేయమని కోరామని, సీఎం జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు నాటికి ఆయనను ప్రొద్దుటూరుకు పిలిపించి ఆయన చేతుల మీదుగా పధకాన్ని లాంచనంగా ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ఇక ప్రొద్దుటూరు లో త్రాగు నీటి సమస్య లేదని ఆయన ధీమా వ్యక్తం చేస్తూ, తాను గర్వ పడే అంశంగా అమృత్ పధకాన్ని అభివర్ణించారు, నాయకులు, అధికారుల సహాయ సహకారాలు తాను మరువలేను ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలియచేసారు.
Comments