top of page
Writer's pictureEDITOR

ఒమిక్రాన్‌కు ఆనందయ్య మందు

నెల్లూరు: ఒమిక్రాన్‌కు ఆనందయ్య మందు.. రెండు రకాల మందులు సిద్దం

ఒమిక్రాన్ ప్రపంచ మొత్తాన్ని వణికిస్తోంది. ఈ కేసుల సంఖ్య రోజు రోజు పెరిగిపోతున్నాయి. కొన్ని దేశాల్లో వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. భారత్‌లో కూడా 400కుపైగా కేసులు వచ్చాయి. ఇలాంటి సమయంలో నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆయుర్వేద నిపుణుడు బొనిగి ఒమిక్రాన్‌కు తన దగ్గర మందు ఉందని ప్రకటించారు. ప్రత్యేకంగా మందు తయారు చేసి పంపిణీ చేస్తున్నారు. ఒమిక్రాన్‌ సోకకుండా ముందు జాగ్రత్తగా బూస్టర్‌ మందు కూడా సిద్ధం చేశారు. దాదాపు 22 రకాల దినుసులతో ఐదు రకాల మందులు తయారు చేసినట్లు తెలిపారు. ఒమిక్రాన్‌ రాకుండా ముందు జాగ్రత్తగా తీసుకునే మందు కూడా తయారు చేశామని.. ఒకే రోజు రెండు పూటలా తీసుకుంటే చాలన్నారు. ఈ మందుల తయారీకి కోర్టు అనుమతి కూడా ఉందని చెప్పడం కొసమెరుపు. తాను తయారు చేసిన ఒమిక్రాన్‌ మందు తీసుకునే వారు 15 రోజుల పాటు మాంసాహారం, మద్యం తీసుకోకూడదన్నారు. ఒకవేళ ఎవరైనా ఒమిక్రాన్‌తో బాధపడుతుంటే మందు కోసం నేరుగా సంప్రదించొచ్చని ఆనందయ్య తెలియజేశారు. ఎవరినైనా పంపించినా మందు ఇస్తానని ప్రకటించారు. ప్రస్తుతం ఈ మందును బంధువులు, మిత్రుల ద్వారా ఒమిక్రాన్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న విదేశాలకు ఎక్కువగా పంపిస్తున్నట్టు తెలిపారు. ఈ మందును ఏడాది పాటు నిల్వ ఉంచుకోవచ్చని.. త్వరలోనే బాటిల్స్‌ రూపంలో అందుబాటులోకి తెస్తామంటున్నారు. ఇదిలా ఉంటే ఆయుష్ శాఖ వాదన మాత్రం మరోలా ఉంది. కరోనాకు, ఒమిక్రాన్‌ వేరియంట్‌కు మందు ఇస్తామని తమనెవరూ సంప్రదించలేదని అధికారులు ప్రకటించారు. అలాంటి గుర్తింపులేని వ్యక్తులు అందించే మందులను ఆయుర్వేద మెడిసిన్‌గా భావించొద్దని ఆయుష్‌ శాఖ స్పష్టంచేసింది. ఒమిక్రాన్‌కు ఆయుర్వేద మందు ఇస్తామని కొందరు చెపుతున్న నేపథ్యంలో ఏపీ ఆయుష్ శాఖ క్లారిటీ ఇచ్చింది. ఒమిక్రాన్‌ కోసం ప్రభుత్వం ఆయుర్వేద మందుకు అనుమతివ్వలేదని స్పష్టం చేసింది. ఎవరైనా గుర్తింపు లేని వ్యక్తుల ద్వారా అందించే మందును ఆయుర్వేద మందుగా భావించి నష్టపోవద్దని ఈ సమాచారం తెలియచేస్తున్నట్లు ఏపీ ఆయుష్ శాఖ తెలిపింది. ప్రభుత్వ గుర్తింపు పొందిన Ayush-64, Arsenic Album 30C లాంటి హోమియో మందులను వైద్యుల సలహా మేరకు తీసుకోవడం మంచిందంటున్నారు. వాక్సిన్‌ తీసుకోవడం, మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించాలని సూచించారు.

1 view0 comments

Opmerkingen

Beoordeeld met 0 uit 5 sterren.
Nog geen beoordelingen

Voeg een beoordeling toe
bottom of page