అనంతపురం జిల్లా పొట్లూరు మండలం బాలాపురం గ్రామానికి చెందిన సాకె పెద్దయ్య మరియు వారి కూతుర్లపై అగ్రవర్ణాల వారు జరిపిన అమానుష భౌతిక దాడి జరిగిన విషయం పాఠకులకు విదితమే. అయితే జరిగిన సంఘటన భౌతిక దాడిని కండిస్తూ నేడు రాష్ట్ర వాల్మీకి యువసేన గౌరవ అధ్యక్షుడు నల్లబోతుల నాగరాజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అగ్రవర్ణాలు ఇలా దాడి చేయడం నీచమైన చర్య అని, ఆడపిల్ల అని చూడకుండా దారుణంగా పొలం లో మేకలు మేత కోసం వెళ్లాయన్న నెపం తో దాడి చేయడం దారుణమన్నారు. కేవలం బోయ కుటుంబానికి చెందిన వారు కాబట్టి వారిని హింసించడం అమానుషం అని ఆవేదన వ్యక్తం చేశారు, జరిగిన సంఘటన పై సంబంధిత లోకల్ పోలీసు అధికారులు అగ్రవర్ణాల వారికి కొమ్ముకాస్తున్నారని న్యాయం చేయాల్సిన అధికారులే ఏకపక్షంగా ఓ వర్గానికి మద్దతుగా రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించడం అత్యంత బాధాకరమని, ఈ సంఘటనకు సంబంధించి అనంతపురం జిల్లా SP గారు వెంటనే స్పందించి ఓ DSP స్థాయి అధికారిని నియమించి జరిగిన సంఘటన పై సమగ్ర విచారణ జరిపి భాదిత కుటుంబానికి తగు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాల్మీకి యువసేన తరపున డిమాండ్ చేశారు. అలా చేయలేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా వాల్మీకి బోయలు కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. జరిగిన సంఘటనకు సంబంధించి అనంతపురం జిల్లా కలెక్టర్ గారు అదే విధంగా రాష్ట్ర మహిళా కమిషన్ కూడా స్పందించి బాధితులకు తగిన విధంగా న్యాయం చేయాలని కోరారు, ఈ కార్యక్రమంలో వాల్మీకి యువసేన కమిటీ సభ్యులు మండ్ల రఘునాథ్, వెంకట రమణ, నల్లబోతుల వెంకట సుబ్బయ్య, కాల్వ కట్ట సుబ్బయ్య, పాల్గొన్నారు.
top of page
bottom of page
Comments