గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలోని మాలమహానాడు కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాలమహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు గోదా జాన్ పాల్ పాల్గొని మాట్లాడుతూ విశాఖపట్నం ఆంధ్రా యూనివర్శిటీ లొ SC మాల కులానికి చెంది ప్రొఫెసర్గా ముప్పై ఐదు సంవత్సరాల అనుభవం కలిగి 30 PHD లు 40 M PHIL కి పైబడి రీసెర్చ్ స్కాలర్స్ టీ అందించే విధంగా కృషి చేసిన ఆచారంగా కోటి జాన్ పై దాడి చేసే ప్రయత్నం చేసి బలవంతంగా దళితుడనే కారణంతో ఆయన రూమ్ నుండి ముప్పై ఐదు సంవత్సరాల కష్టంతో సంపాదించుకున్న మేధోశక్తిని ధ్వంసం చేయించిన వైస్ ఛాన్సలర్ పడాల వెంకట దుర్గా ప్రసాద్ రెడ్డి పై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నమోదుచేసి అడ్డుపడిన విద్యార్థి రోహిత్ కుమార్ పై ప్రిన్సిపల్ రాజేంద్ర కర్మాకర్ సెక్యూరిటీ ఖాన్ లు పిడిగుద్దులతో కొట్టి గాయపర్చిన పై వారిని విధుల నుండి తొలగించి వారిపై సంబంధిత కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
హోదా జాన్ పాల్ మాట్లాడుతూ ఆంధ్రా యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ ప్రసాదరెడ్డి అరాచకాలు చూస్తుంటే గతంలో మహేష్ , ప్రేమయ్యా ప్రస్తుతం ఆచార్య కోటి జాన్, రోహిత్ కుమార్ లపై దాడులు చూస్తుంటే ఈపాటి వివక్షత చుూయిస్తోన్న ప్రసాద్రెడ్డి పై గవర్నర్ కానీ ప్రభుత్వం కానీ ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆంధ్రా యూనివర్సిటీలో రిటైర్డ్ అయిన ఆచార్యులు అగ్ర కులానికి సంబంధించిన వ్యక్తులు పది సంవత్సరాల పైబడి ఉంటుంటే వారిని ఖాళీ చేయించే ధైర్యం లేని పిరికి ప౦ద లాగా ప్రసాద్రెడ్డి యూనివర్సిటీ గ్రాంట్స్ (UGC) కమీషన్ కి లోబడి పని చేయాలన్న విషయం తెలియని వ్యక్తి వైస్ ఛాన్సలర్గా అనర్హుడని లేబర్ లా లో అంబేద్కర్ గారి పై పిహెచ్డి చెేసి విద్యార్థి ,స్కాలర్గా, నేడు ప్రొఫెసర్గా అడ్మినిస్ట్రేషన్పై ప్రశ్నించే గొంతుక గా నిలిచిన ఆచార్య కోటి జాన్ పై ఇటువంటి వివక్షత దారుణమని ఆయన రూమ్ కి రూమ్ ఖాళీ చేయకపోతే పెన్షన్ నుండి పదివేలు డిటెక్టి చేస్తామని నోటీసు అంటించట౦ వైస్ ఛాన్సలర్ దళిత వ్యతిరేక విధానాలకు అద్దం పడుతోందని తక్షణమే ప్రభుత్వం స్పందించి వైస్ చాన్సలర్ ప్రసాద్రెడ్డి ప్రిన్సిపల్ రాజేంద్ర కర్మాకర్ మరియు ఖాన్ లపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతొ పాటు పలు కేసులు నమోదు చేసి వారిని విధుల నుండి తొలగించకపోతే మాలమహానాడు మరియు ప్రజాసంఘాలను ,విద్యార్థి సంఘాలను, కలిసొచ్చే రాజకీయ పార్టీలను కలుపుకొని '''ఛలో ఆంధ్రా యూనివర్శిటీ పిలుపు ''' నిచ్చి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని గోదా జాన్ పాల్ హెచ్చరించారు ఈ సమావేశంలో మాలమహానాడు వినుకొండ నియోజకవర్గ వర్కింగ్ అధ్యక్షులు కొమ్మతోటి పౌలు గౌరవ అధ్యక్షులు కొమ్మతోటి కృపారావు, నియోజకవర్గ సెక్రటరీ కొట్టే వెంకట్రావ్, చావా సామెలు , శావల్యాపురం మండల అధ్యక్షులు మాల ప్రోలు ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
Commentaires