అంగన్వాడీ కేంద్రాల పై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ఆకస్మిక తనిఖీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ డీజీ గారైన శ్రీ శంఖ భ్రత భాగ్చి IPS గారి ఆదేశముల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అంగన్వాడీ కేంద్రాల వద్ద వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పధకం ఎలా అమలు జరుగుతున్నది తెలుసు కొనుటకు ఆకస్మీక తనిఖీలు చేపట్టారు. తిరుపతి మరియు చిత్తూరు జిల్లాలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి అయిన శ్రీ ఈశ్వర రెడ్డి గారి ఆధ్వర్యం లొ అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి ఈ దినం తేది. 14.10.2022 ఉదయం నుండి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నుండి గర్భిణీ స్త్రీలకు బాలింతలకు, శిశువులకు, బాలబాలికలకు ఉచితంగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందచేసే ఆహారము, రేషన్, ఇతర పదార్థములు ఏ విధంగా పంపిణీ అవుతున్నాయి? ఏమైనా లోటు పాట్లు అవక తవకలు ఉన్నాయా? అనే విషయాలపై కూలంకషంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారు.
ఈ సందర్భంగా విజిలెన్స్ అధికారి శ్రీ కె ఈశ్వర రెడ్డి మాట్లాడుతూ ఈ దినం రామచంద్రాపురం మండలంలోని లోకమాతా పురం, ఏర్పేడు మండలం మర్రిమంద బిసి కాలనీ, సోమల మండలంలోని హరిజనవాడ (సోమల) మరియు పుంగనూరు మండలంలోని ఈస్ట్ పేట అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించడం జరిగిందని, తమ పరిశీలనకు వచ్చిన విషయాలను ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం అని చెప్పారు. అంగన్వాడీ కార్యకర్తలను, కొంతమంది గర్భిణీ స్త్రీలను, బాలింతలను, చిన్నపిల్లలను విచారించి వారికి అన్ని వస్తువులు అందుతున్నాయా లేదా అని తెలుసు కున్నారు . అలాగే అంగన్వాడీ కేంద్రాల మీద, సంక్షేమ వసతి గృహాల మీద, ఆరోగ్య కేంద్రాల మీద, ప్రభుత్వ పథకాల అమలు మీద నిరంతరం పరిశీలన కొనసాగుతూనే ఉంటుంది. అని చెప్పారు.
Comments