అంగన్వాడీలపై అమానుషంగా ప్రవర్తించిన వైసీపీ ప్రభుత్వం - ఏఐటీయూసీ
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
అంగన్వాడీల పట్ల అమానుషత్వంగా వైసిపి ప్రభుత్వం వ్యవహరించిందని ఈ తీరును నిరసిస్తూ నేడు రాజీవ్ సర్కిల్ నందు AITUC అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా AITUC రాష్ట్ర కార్యదర్శి పి సుబ్బరాయుడు, అంగన్వాడి నాయకురాలు శివ నారాయణమ్మ లు మాట్లాడుతూ, తమ జీతాలు పెంచమని అడగడమే నేరమన్నట్లు విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద జరుగుతున్న అంగన్వాడీల ఆమరణ దీక్షను భగ్నం చేయటం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేటి తెల్లవారుజామున 2 గంటలకు విద్యుత్ ను అపేసి, మీడియా వారు లేరని అంగన్వాడిల పట్ల పోలిసులచే విచక్షణా రహితంగా కొట్టుకుంటూ తీసుకెళ్ళి వారిని బందరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో నిర్బంధించిన తీరు అసహ్యకరమైనదన్నారు. జగన్ ఇచ్చిన వాగ్దానాన్ని అమలుచేయమని కోరడమే నేరమా అని ప్రశ్నించారు. 5 సంవత్సరాలుగా వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమని, అధిక ధరలను అదుపు చేయమని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లించమని,సంక్షేమ పథకాలను అమలు చేయమని అడుగుతుంటే ఏసమస్య పట్టించుకోకుండా కాలయాపన చేసిన దరిమిలా కార్మిక సంఘాలుగా చివరి అస్త్రంగా సమ్మెకు దిగి 42 రోజులౌతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం వల్ల అంగన్వాడీలు ఆమరణ దీక్షను చేపట్టారన్నారు.
ప్రభుత్వం మొండికేసి ఎస్మా అన్నా తగ్గే ప్రసక్తేలేదని మహిళా సాధికారత దిశగా వేతనాలు పెంచాలని, నోరుండి మాట్లాడలేని వారికి మా ఉద్యమం ఆదర్శప్రాయమౌతుందని ఈ ప్రభుత్వం భయపడే కర్కశంగా చలో విజయవాడకు వొచ్చే అంగన్వాడీ కార్యకర్తలను ఎక్కడికక్కడ పొలిసులచే అరెస్ట్ లకు ప్రభుత్వం తెగబడితే ఖాతరు చేయకుండా అంగన్వాడీలు విజయవాడకు చేరుకున్నవారిని కూడా నిరసన వ్యక్తం చేయను కూడా ఈప్రభుత్వం కట్టడి చేస్తూ మహిళలను,నాయకులను పశువులను బాదినట్లు పొలిసులచే బాదించడం జగనే తన పతనానికి తానే నాంది పలుక్కున్నాడన్నారు. ఇక తగిన మూల్యం ఈ ప్రభుత్వం చెల్లించుకోవల్సి వస్తుందని హెచ్చరించారు. సిడిపివోలు కొందరు సుపర్వజర్లచే అంగన్వాడిలను విధుల్లో చేరుకోవాలని లేకపోతే మీ అయాలను కార్యకర్తలుగా ప్రమోట్ చేసుకుంటామని లేదా కొత్తవారిని తీసుకోమని ఆర్డర్స్ వొచ్చాయంటు భయపెడుతున్నారని ఈ చర్యలను తాము ఖండిస్తున్నామని,చట్టబద్ధంగా సమ్మె నోటీస్ ప్రభుత్వానికి, అధికారులకు ఇచ్చామని ఈ విషయం అధికారులు మర్చిపోవద్దని వారన్నారు.
ఈ నిరసన కార్యక్రమoలో AITUC మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి బి రామయ్య,జిల్లా కార్యదర్శి మద్దిలేటి, AITUC నాయకులు యోసోబ్, సుబ్బరాయుడు, అంగన్వాడి నాయకురాళ్లు గౌసీయ, గురుదేవి, సుభాషిణి, తదితరులు పాల్గొన్నారు.
Comentários