అంగన్వాడీలకు టి.ఎ, డి.ఎ చెల్లించాలి - సిఐటియు డిమాండ్
రాజంపేట, అంగన్వాడీ కేంద్రాలకు పెండింగ్ లో ఉన్న కూరగాయల బిల్లులు, టి. ఏ, డి. ఏ బిల్లులు వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా కార్యదర్శులు చిట్వేలి రవికుమార్, సి.హెచ్ చంద్రశేఖర్ లు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక ఎన్జీవో కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా రాజంపేట ఐ సి డి ఎస్ ప్రాజెక్టు లోని రాజంపేట, పెనగలూరు, నందలూరు, మండలాల్లోని అంగన్వాడి కేంద్రాలకు కూరగాయల బిల్లులు గత నాలుగు నెలల నుంచి చెల్లించలేదని.. పిల్లలకు, గర్భిణీలకు, తక్కువ వేతనంతో పనిచేసే అంగన్వాడీలు వేలాది రూపాయలు హెచ్చించి, కూరగాయలు కొనుగోలు చేసి వడ్డించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏడవ తేదీ లోపల బిల్లులు చెల్లించకపోతే అదే రోజున ఐసిడిఎస్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతుందిని హెచ్చరించారు. అదేవిధంగా టి.ఏ, డీ.ఏలు 2017 నుండి ఐదు సంవత్సరాలపాటు ఇవ్వకపోతే ఎలా సమావేశాలకు రావాలని ప్రశ్నించారు. ఇంటి అద్దెలు, గ్యాస్ బిల్లులు తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు. కమిషన్ కోసమే, ట్రెజరీలో బిల్లులు పెండింగ్ పెడుతున్నారని ఆరోపించారు. సమస్యలు పరిష్కరించని ఎడల ఉద్యమము తప్పదని హెచ్చరించారు.
Comments