ఎన్నికల కోడ్ రావడంతోనే అన్న క్యాంటీన్ సేవలకు అంతరాయం
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ఎన్నికల కోడ్ రావడంతోనే అన్న క్యాంటీన్ సేవలకు అంతరాయం కలుగుతోందని టిడిపి రాష్ట్ర నాయకులు సి. ఎం. సురేష్ నాయుడు తెలిపారు. ఆదివారం స్థానిక కొర్రపాడు రోడ్డు లోని అన్న క్యాంటీన్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2023 జూలై 5వ తేదీ నుంచి ప్రారంభించిన ఈ అన్న క్యాంటీన్ ద్వారా ఆదివారాలు మినహా 217 రోజుల పాటు రోజుకు 5000 మంది చొప్పున, దాదాపు 11లక్షల మందికి ఆకలి తీర్చామని వివరించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఈ కార్యక్రమం జరగడం ఆనందకరమన్నారు. ఎన్నికల కోడ్ రావడంతో ఆదేశాల మేరకు అన్న క్యాంటీన్ సేవలను నిలిపివేయడం జరిగిందని తెలిపారు. ఎన్నికల అనంతరం టిడిపి జనసేన బిజేపి కూటమి విజయం సాధించి ప్రభుత్వం రాగానే తిరిగి ప్రభుత్వ సారధ్యంలో కొనసాగిస్తామని వివరించారు. అన్న క్యాంటీన్ నిర్వహణలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వి.ఎస్.ముక్తియార్, మాజీ పట్టణాధ్యక్షులు ఈ. వి. సుధాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Comments