అన్నమాచార్యలో ప్రారంభమైన టెక్ మారథాన్
ప్రసన్న ఆంధ్ర, రాజంపేట
అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం నుంచి టెక్ మారథాన్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం మూడు రోజులపాటు కళాశాలలో నిర్వహించడం జరుగుతుందని, 500 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని మూడు రోజులలో భాగంగా తొలుత ఒకటిన్నర రోజు శిక్షణ, మిగిలిన ఒకటిన్నర రోజు శిక్షణలో నేర్చుకున్న మెళుకవలు మీద వారిని పరీక్షించడం జరుగుతుందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ఎంవీ నారాయణ వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో స్మార్ట్ బ్రిడ్జి డైరెక్టర్ యుక్తేష్ మాట్లాడుతూ మూడు రోజులు జరిగే కార్యక్రమాలను టెక్నికల్ బూట్ క్యాంప్ (ఒకటిన్నర రోజు శిక్షణ), టెక్ మారథాన్ (ఇచ్చిన శిక్షణపై24 గంటలపాటు పరీక్ష) అనే రెండు భాగాలుగా విభజించడం జరుగుతుందన్నారు. టెక్ బూట్ క్యాంపు ఆధారంగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మిషన్ లర్నింగ్, డేటా అనలైటిక్స్ అనే అంశాలపై ఒకటిన్నర రోజు పాటు శిక్షణ ఇచ్చి , మరో ఒకటిన్నర రోజు టెక్ మారథాన్ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. పై కార్యక్రమంలో నేర్చుకున్న అంశాలపై విద్యార్థులు టూరిజం, స్మార్ట్ వెహికల్, ట్రాన్స్ పోర్టేషన్ అండ్ లాజిస్టిక్, క్లీన్ అండ్ గ్రీన్ టెక్నాలజీస్, స్మార్ట్ ఎడ్యుకేషన్, డిజాస్టర్ మేనేజ్ మెంట్, అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, రెన్యువబుల్ ఎనర్జీస్ అండ్ మిడీ టేక్, బయోటెక్లలో ప్రతిక్షేపించి అప్లికేషన్స్ ను అభివృద్దిపరిచి, ప్రెజెంటేషన్ ఇచ్చిన వంద గ్రూపుల నుంచి పది గ్రూపులను ఎంపిక చేసి అనంతరం వారికి మరలా పోటీలు నిర్వహించి మొదటి మూడు బహుతులను ప్రకటించడం జరుగుతుందని తెలియజేశారు.
మొదటి బహుమతి రూ. 25 వేలు, ద్వితీయ బహుమతి రూ. 15 వేలు, తృతీయ బహుమతి రూ. 10 వేలు అందజేయడం జరుగుతుందని కో-ఆర్డీనేటర్ ఎస్ మహ్మద్ రఫీ తెలియజేశారు. విద్యార్థులకు కావాల్సిన అన్ని మౌళిక సదుపాయాలను కళాశాలలో ఏర్పాటు చేశామని, కావున విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకొని ముందుకెళ్ళాలని కార్యక్రమ కన్వీనర్ డాక్టర్ ఎం సుబ్బారావు, హెచ్ఓడీ, సీఎస్ఈ సూచించారు. అనంతరం ట్రైనింగ్ అండ్ ప్లేస్ మెంట్ ఆఫీసర్ కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు వలన విద్యార్థులలో దాగివున్న సృజనాత్మకతను వెలికితీయవచ్చని, కావున విద్యార్థులు ఇటువంటి కార్యక్రమాలలో విరివిగా పాల్గొని మరింత అభివృది చెందాలని కోరారు. కార్యక్రమం జరగడానికి ప్రోత్సహించిన కళాశాల యాజమాన్యం డాక్టర్ చొప్పా గంగిరెడ్డి, ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ చొప్పా అభిషేక్ రెడ్డిలకు విద్యార్థులు, అధ్యాపకులు కృతజ్ఞతలు తెలిపారు. ఇటువంటి కార్యక్రమం తమ కళాశాలలో నిర్వహిస్తున్నందుకు స్మార్ట్ బ్రిడ్జ్ టెక్నాలజీ వారిని కళాశాల వైస్ చైర్మన్ చొప్పా ఎల్లారెడ్డి అభినందించారు
.
Kommentare