జాతీయస్థాయిలో అన్నమాచార్య విద్యార్థుల ప్రతిభ
ప్రసన్న ఆంధ్ర, రాజంపేట
ఎన్.పి.టీ.ఈ.ఎల్ జాతీయ స్థాయి పరీక్షలలో అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపి జాతీయస్థాయిలో 37వ స్థానాన్ని, ఏ.ఏ ర్యాంకును సొంతం చేసుకున్నారని కళాశాల వ్యవస్థాపకులు చొప్పా గంగిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇటీవల జరిగిన స్వయం నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నికల్ ఎన్ హ్యాన్సు అండ్ లర్నింగ్ (ఎన్.పి.టి.ఈ.ఎల్) పరీక్ష నందు జాతీయ స్థాయిలో ఉన్న ఐఐటి, ఎన్.ఐ.టి యూనివర్సిటీలతో పోటీపడి 37వ స్థానం సొంతం చేసుకోవడంతో పాటు ఏ.ఏ ర్యాంక్ రావడంతో ఇటీవల ఐఐటీ చెన్నై లో జరిగిన సౌత్ ఇండియా స్పోక్ సమావేశంలో కళాశాల ఎస్పీఓసి ఎన్.కిషోర్ కుమార్ అవార్డును స్వీకరించారని అన్నారు. కళాశాల వ్యవస్థాపకులు డాక్టర్ చొప్పా గంగిరెడ్డి, కళాశాల చైర్మన్ డాక్టర్ సి.రామచంద్రారెడ్డి, వైస్ చైర్మన్ చొప్పా ఎల్లారెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.ఎం.వి నారాయణ, కళాశాల డీన్లు, వివిధ విభాగాల హెచ్ఓడీలు, అధ్యాపకులు కిషోర్ కుమార్ కు ఈ సందర్బంగా అభినందనలు తెలియజేశారు.
Commentaires