(ఆర్.ఎస్ మహమ్మద్ రఫీ రాయచోటి విలేకరి)
నా మనసులో అన్ని మతాలపై గౌరముందని రాజంపేట ఆర్.డి.ఓ కోదండ రామిరెడ్డి అన్నారు. రాజంపేట అల్ బ్రదర్ మసీదులో రంజాన్ ఉపవాసాల సందర్బంగా జరిగిన కార్యక్రమంలో అయన మాట్లాడుతూ ప్రతి మతం కూడా దేవుడిని నమ్ముతారు, మనల్ని నడిపించే శక్తి మన వెనుక ఉందని నమ్ముతారు. మనం వేరే గ్రహం నుండి వచ్చిన జీవులం, మనకు జంతువులకు చాలా తేడా ఉందన్నారు. చంద్రుని గమనాన్ని బట్టి మన క్యాలెండరు రూపొందించారు. హిందువులు ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉంటారు. ఉపవాసం చేస్తే ఆయుస్సు పెరుగుతుందని ఏకాదశి వ్రతంలో చెప్పబడుతోంది .వయస్సు పెరిగేకొద్దీ మనవ డిఎన్ఏ తగ్గుతూ వస్తుంది. ఒక అణువు నుండి విశ్వం ఏర్పడిందని సైన్స్ చెబుతోంది. ఇదే 1600 సం .రాల క్రితం ఖురాన్లో చెప్పబడింది. ఈ విశ్వం ఇంకా విస్తరిస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో రాజంపేట తాలూక ఎన్ .జి .ఓ ప్రెసిడెంట్ ఎస్ .వి.రమణ, ఈడిగ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ దాసరి చిదానంద గౌడ్, ఆల్ బ్రదర్ మసీద్ ప్రెశిడెంట్ గండికోట గుల్జార్ బాషా, పెద్ద మసీదు ప్రెసిడెంట్ షేక్ సిరాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు .
Comments