నూతన మంత్రివర్గంలో అన్నమయ్య జిల్లాకు దక్కని చోటు -చివరి క్షణంలో ఎమ్మెల్యే కొరముట్ల పేరు మాయం - తీవ్ర నిరాశలో నియోజకవర్గ ప్రజలు.
కొత్త జిల్లాలు ఏర్పాటు... అన్నమయ్య జిల్లా లోని నియోజకవర్గాలైన రాజంపేట, రైల్వేకోడూరు ప్రజల అసంతృప్తికి దారి తీసి ప్రజల్లో పూర్తి ఆవేదన నింపింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
అయితే గత కొద్ది రోజుల నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన నూతన మంత్రివర్గ విస్తరణ లో అన్నమయ్య జిల్లా ప్రతినిధులకు చోటు దక్కే అవకాశం మెండుగా వినిపించింది. కానీ చివరి క్షణంలో ఇది తారుమారైంది. దీనితో కోడూరు నియోజకవర్గంలోని ఎమ్మెల్యే కొరముట్ల బెర్తు ఖరారు అనుకున్న తరుణంలో మా ఊరు ఊరు అభివృద్ధి చెందక పోతాదా!! అని వెయ్యి కళ్ళతో వేచి చూసిన ప్రజలకు నిరాశ ఎదురైంది.
దీనితో మా అందరికీ ఇష్టం లేని అన్నమయ్య జిల్లా పై ముఖ్యమంత్రికి ఎందుకు ఇంత చిన్నచూపు..?? అన్న గుసగుసలు ప్రజల్లో మరింతగా వినిపిస్తున్నాయి. వైసిపి పార్టీ మాది అనుకున్న నాయకులకు, కార్యకర్తలకు అభిమానులకు ఇది జీర్ణించుకోలేని విషయం. కొరముట్ల రిజర్వుడు స్థానానికి చెందిన వాడు కాబట్టి చిన్నచూపు చూశారా?? అన్న మాటలు కూడా నియోజకవర్గ ప్రజల్లోమారు మ్రోగుతున్నాయి. ఏది ఏమైనా వరుసగా నాలుగు సార్లు వైసిపి అభ్యర్థిగా గెలుపొంది ఆ పార్టీకి ఎనలేని సేవలు చేస్తూ ప్రజల్లో మంచి మనిషిగా పేరుపొందిన ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు కు మరియు నియోజకవర్గ ప్రజలకు ఇది తీవ్ర నిరాశ అని చెప్పాలి.
תגובות