నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన అన్నమయ్య విగ్రహం తొలగింపు
వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు స్థానిక బొల్లవరం కూడలిలో నిబంధనలకు వ్యతిరేకంగా శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటుచేసిన అన్నమయ్య విగ్రహాన్ని నిన్న రాత్రి పొద్దుపోయాక అధికారులు తొలగించారు .అత్యున్నత న్యాయస్థానాల ఆదేశాల మేరకు రహదారులు, డివైడర్లు మధ్య ఎటువంటి విగ్రహాలు పెట్టకూడదని నిబంధన ఉండటంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు.
ఏడాదిన్నర కిందట ఇదే ప్రాంతంలో అన్నమాచార్యులు విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో నిబంధనలు లేవంటూ అప్పుడు అధికారులు విగ్రహాన్ని తొలగించి స్థానిక బొల్లవరం వెంకటేశ్వర స్వామి గుడికి తరలించారు. అయితే మరల శనివారం రాత్రి అన్నమయ్య విగ్రహాన్ని బొల్లవరం కూడలి లోనే ప్రతిష్టించారు. విగ్రహం విషయం పట్టణమంతా చర్చనీయాంశం అవడంతో అధికారులు నిన్న రాత్రి పొద్దుపోయాక ఆ విగ్రహాన్ని తొలగించి మరల బొల్లవరం వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి తరలించారు.
Comments