శ్రీ సాయి వికాస్ లో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు.
అమరజీవి పొట్టి శ్రీరాములు స్మరించుకుంటూ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను బుధవారం స్థానిక శ్రీ సాయి వికాస్ పాఠశాల నందు కరస్పాండెంట్ తిరుమల రెడ్డయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పొట్టి శ్రీరాములు ప్రతిమను విద్యార్థులు రంగవల్లులుగా రూపొందించారు. అమరజీవి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
కరస్పాండెంట్ తిరుమల రెడ్డయ్య మాట్లాడుతూ అమరజీవి అమరన దీక్షతో ఆత్మార్పణం చేయడం వల్లనే ఆంధ్ర రాష్ట్రం 1953 నవంబర్ 1 న తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పాటైందని అన్నారు. ప్రధానోపాధ్యాయులు షాజి భాస్కర్ మాట్లాడుతూ తెలుగు భాష ప్రాధాన్యతను గుర్తించి మద్రాసులో మమేకమై ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడంలో పొట్టి శ్రీరాములు కీర్తి ఎప్పటికీ మరువలేనిదని అన్నారు. ఉపన్యాసాలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో పాఠశాల పిల్లలు పలు కార్యక్రమాలు నిర్వహించారు. బోధనా సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Comentários