వాట్సాప్‌తో చేతులు కలిపిన ఏపీ డిజిటల్ కార్పోరేషన్. ప్రజలకు మరింత వేగంగా అందనున్న ప్రభుత్వ సమాచారం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను డిజిటల్ మాధ్యమాల ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఏపీ డిజిటల్ కార్పోరేషన్(APDC)
ఇప్పుడు వాట్సాప్ సేవలను కూడా ప్రారంభించింది. ఇందు కోసం వాట్సాప్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
‘రాష్ట్రంలో ఇ-గవర్నెన్స్ మరింత మెరుగుపరిచే ప్రయత్నంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం మాకు గర్వంగా ఉంది. వైవిధ్యభరితమైన, ప్రతి అవసరానికి తగిన ఇ-గవర్నెన్స్ పరిష్కారాలు నగరపాలక సంస్థలకు అందించి, వాటితో కలిసి పని చేసేందుకు మేం నిరంతరం ప్రయత్నిస్తాం’ అని వాట్సాప్ ఇండియా పబ్లిక్ పాలసీ అధిపతి శివనాథ్ ఠూక్రాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments