ఏపీలో నిధుల కొరతతో అల్లాడుతున్న వైసీపీ సర్కార్ ఎడాపెడా నిధుల్ని పీడీ ఖాతాలకు మళ్లించి వాడేసుకుంటోంది. నిబంధనల్ని ఉల్లంఘించి మరీ పీడీ ఖాతాలకు నిధులు మళ్లిస్తున్నారంటూ కాగ్ వంటి సంస్ధలతో పాటు విపక్షాలు కూడా ఆరోపిస్తుంటే ప్రభుత్వం మాత్రం లైట్ తీసుకుంటూ వచ్చింది. ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు ఇదే అంశంపై కొరడా ఝళిపించింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి నుంచి నిధుల్ని పీడీ ఖాతాలకు మళ్లించడంపై కన్నెర్ర చేసింది.
ఏపీలో భారీ అప్పులతో సతమతం అవుతున్న వైసీపీ సర్కార్ కొత్త అప్పుల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అదే సమయంలో రాష్ట్రంలో అందుబాటులో ఉన్న కేంద్ర, రాష్ట్ర నిధులన్నింటినీ పీడీ ఖాతాలకు మళ్లిం చేస్తోంది. కేంద్ర నిధుల మళ్లింపు విషయంలో ఇప్పటికే ఆర్ధికశాఖతో పాటు పలు కేంద్ర విభాగాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వ విపత్తు నిర్వహణ నిధుల్ని సైతం పీడీ ఖాతాలకు మళ్లించడంపై విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇదే అంశంపై విపక్ష నేతలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
Comments