గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో సర్పంచ్ అధికారాలకి కోతపెడుతూ ఎమ్మెల్యేలకి అధికారాలు కట్టబెట్టడంపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బీరావారిపేట కే. పెదపుడు కి చెందిన సర్పంచ్ బీరా శ్రుతి హై కోర్టులో వ్యాజ్యం దాఖలు.
సర్పంచిల పాత్ర లేకుండా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు స్థానిక ఎమ్మెల్యే మాత్రమే చేయాలి అంటూ ఇచ్చినటువంటి జీవో ఆర్టీ నెంబర్ 123, పంచాయతీరాజ్ చట్టానికి రాజ్యాంగం ఆర్టికల్ 243 కి విరుద్ధమంటూ హైకోర్టులో వాదనలు వినిపించిన మాజీ న్యాయమూర్తి, హైకోర్టు ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్.
ప్రజల ద్వారా ఎన్నుకోబడిన సర్పంచ్ అధికారాలకు కోత పెడుతూ ఎమ్మెల్యేలకి మాత్రమే అధికారం ఇవ్వటం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమన్న మాజీ న్యాయమూర్తి,ప్రస్తుత హైకోర్టు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్. తక్షణమే ఈ జీవోని రద్దు పరచకపోతే గ్రామస్థాయిలో సర్పంచులు తమ అధికారాలు వినియోగించుకోలేరన్న న్యాయవాది
ప్రతివాదులుగా ఉన్న ప్రిన్సిపల్ సెక్రెటరీ పంచాయతీరాజ్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ మరియు ఇతర అధికారులను మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయవలసిందిగా హైకోర్టు ఆదేశాలు. కేసు విచారణ నాలుగు వారాలకు వాయిదా.
Comentários