top of page
Writer's pictureEDITOR

ఏపీ సర్పంచుల ఐక్య వేదిక డిమాండ్స్

ఏపీ సర్పంచుల ఐక్య వేదిక డిమాండ్స్

తాడేపల్లి


గుంటూరు జిల్లా తాడేపల్లి వైయస్సార్సీపి పార్టీ కేంద్ర కార్యాలయం నందు బుధవారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ సర్పంచులు ఐక్యవేదిక సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ప్రొద్దుటూరు నియోజవర్గం కొత్తపల్లి పంచాయతీ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి పాల్గొని పలు అంశాలపై చర్చించి వినతి పత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలోప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు, ఎమ్మెల్సీ ఎల్. అప్పిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ముత్యాల నాయుడుకి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించడం జరిగింది.


AP సర్పంచ్ ల ఐక్య వేదిక ద్వారా సర్పంచులు చేసిన డిమాండ్లు :

1) రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచుల గౌరవ వేతనమును రూ. 3,000/-ల నుండి రూ. 15,000/- లకు పెంచాలి.


2) గ్రామ పంచాయతీలలో స్వీపర్ల నియామకం కాంట్రాక్టు పద్దతి మీద సుమారు 15 మందిని మేజర్ పంచాయితీలలో, 10 మందిని మైనర్ లోని నియమించాలని కోరారు.


3) 15వ ఆర్థిక సంఘం నిధులు కేంద్రం నుంచి వచ్చిన తరువాత రాష్ట్ర ప్రభుత్వానికి సర్పంచ్ లు అంతా కూడా బిల్లులను అప్లోడ్ చేసిన తరువాత వెనువెంటనే బిల్లులు జారీ అయ్యే విధంగా రాష్ట్ర ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేయాలని.


4) గ్రామ సుంచాయితీలలో గ్రీన్ అంబాసిడర్ జీతాలు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని, ఆవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.


5) మైనర్ పంచాయితీ కరెంటు బిల్లులు, తాగునీటి సరఫరాకి, వీధిలైట్లకు పూర్తిగా రాష్ట ప్రభుత్వమే భరించాలని, ఉచితంగా కరెంటు ఇవ్వాలని కోరారు.


6) సర్పంచుల విధి నిర్వహణలో మరణిస్తే 20 లక్షలు వరకు ప్రమాద భీమా ఇన్సూరెన్సు సదుపాయమును ప్రభుత్వమే భరించాలి.


7) 15వ ఆర్థిక సంఘం నిధులు PMFS లింకేజ్ ఉన్న కొత్త బ్యాంకు ఖాతాలలోనే డైరెక్టుగా కేంద్రం ప్రతి

పంచాయితీ కొత్త ఖాతాలలోనే వేయాలి..


8) మైనర్, మేజర్ గ్రామ పంచాయితీలకు విద్యుత్ శాఖ వారు ఇష్టానుసారంగా చక్రవడ్డీ, సబ్ చార్జెస్ వేశారని,

వాటిని పూర్తిగా రద్దు చేయ్యాలని కోరారు.


9) గ్రామ పంచాయితీ సర్పంచ్ ల ఆధీనంలోనే గ్రామ సచివాలయముల కార్యకలాపాలు జరగాలని. వాలంటీర్లు,

సిబ్బంది కూడా సర్పంచ్ ఆధీనములో ఉండాలని కోరారు.


10) సచివాలయములపై వచ్చే ఆదాయమును గ్రామపంచాయితీ ఖాతాలోనే జమ చేయాలని. ఎందుకనగా సచివాలయముల ఖర్చులు, స్టేషనరీ, విద్యుత్ ఇతర ఖర్చులు గ్రామపంచాయితీలే భరిస్తున్నాయన్నారు.


11) గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా సమస్యల పరిష్కారానికి విడుదల చేస్తున్న 20 లక్షల నిధులు సర్పంచుల పరిధిలో జరిగే విధంగా ఆదేశాలు జారీ చెయ్యాలని.


12) A.P. P.R. కమిషనర్ ఇచ్చిన మెమోను 744484/CPR & RD/NS/2020, తేది 18-06-000ుకు

మీ పూర్తిగా రద్దు చేయ్యాలని. గ్రామ పంచాయితీలు సిబ్బందికి Revised Pay Scales భరించే స్థితిలో లేవని,


13) రాష్ట్రంలో సర్పంచ్ లకు సంవత్సరములో ఒక్క రోజు వారి కుటుంబ సభ్యులతో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి VIP BREAK DARSHANAM సర్పంచ్ లకు కల్పించాలని డిమాండ్ చేశారు.


319 views0 comments

Comentarios

Obtuvo 0 de 5 estrellas.
Aún no hay calificaciones

Agrega una calificación
bottom of page