top of page
Writer's picturePRASANNA ANDHRA

బాలుడిని అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన ఆర్మీ జవాన్ అరెస్ట్

ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అక్క పల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. భూమా శ్రీనాథ(11) అనే బాలుడిని అదే గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ దొనపాటి వెంకట ప్రశాంత్ కుమార్ అనే వ్యక్తి అత్యాచారం చేసి హత్య చేశాడు.ఈ నెల 22 రాత్రి 8 గంటల సమయంలో అదృశ్యమైన బాలుడు అదే నెల 25వ తేదీ ఎడమకల్లు గ్రామం సమీపంలోని పొలం బావిలో శవమై తేలాడు. అప్పటికే పోలీసులకు తల్లిదండ్రులు సమాచారం అందించారు.


రంగంలోకి దిగిన పోలీసులు పలు బృందాలుగా విడిపోయి బాలుడి మర్డర్ కేసును విచారణ చేపట్టారు.బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం చేసిన వైద్యులు బాలుడి పై అత్యాచారం జరిగినట్లుగా నిర్ధారించారు.వారం రోజుల పాటు పోలీసులు నిందితుడి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.ఎట్టకేలకు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.


నిందితుడిని ఎస్పీ కార్యాలయంలో మీడియా ముందుకు ప్రవేశ పెట్టిన ఎస్.పి మల్లిక గర్గ్ జరిగిన అత్యాచార, హత్య ఉదంతాన్ని మీడియాకు వెల్లడించారు.బాలుడు అదృశ్యమైన తర్వాత బాలుడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు అని తర్వాత బాలుడిని హత్య చేసినట్లుగా గుర్తించి అనంతరం నిందితుడిని గుర్తించేందుకు ఒక స్పెషల్ టీంలు రంగంలోకి దించినట్లు తెలిపారు.


ఓ.ఎస్.డి చౌడేశ్వరి ఆధ్వర్యంలో డీఎస్పీ కిషోర్ కుమార్,దిశ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ ఒంగోలు ట్రాఫిక్ డిఎస్పి మల్లికార్జునరావు, సీఐఫిరోజ్, ఎస్ఐలు సాంబ శివయ్య,బ్రహ్మనాయుడు, మహేష్,ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు జరిగిందని. నిందితుడు మొబైల్ ఫోన్ లో సెక్స్ వీడియోలు చూస్తూ సెక్స్ చేయాలనే ఉద్దేశంతో బాలుడికి వంద రూపాయలు డబ్బులు ఇచ్చి ఒక కూల్ డ్రింక్ బాటిల్ ని తీసుకొని చెప్పాడు.


అనంతరం గ్రామ సమీపంలో ఉన్న ఆంజనేయస్వామి గుడి దగ్గరికి బాలుడిని రమ్మని చెప్పి అక్కడి నుంచి ద్విచక్రవాహనంపై బాలుడిని ఎక్కించుకొని ఎడమకల్లు గ్రామ సమీపంలోని ఓ బావి దగ్గరికి తీసుకు వచ్చి బాలుడికి మాయమాటలు చెప్పి నిందితుడు అత్యాచారం చేశాడని,బాలుడు పెద్దగా ఏడవడంతో తను అత్యాచార చేసిన విషయం ఎక్కడ బయటపడుతుందో అని నిందితుడు బాలుడిని చంపాలని నిర్ణయించుకొని బాలుడి పై దాడి చేసి చంపడమే కాకుండా మృతదేహం ఎవరికీ కనిపించకుండా బాలుడి మృతదేహానికి ఆరు కేజీలకు పైగా బరువుండే రాయిని కట్టి బావిలో పడవేసినట్లు ఎస్పీ తెలిపారు.


నిందితుడు హత్య చేసిన అనంతరం పోలీసుల దృష్టి మళ్ళించే ఉద్దేశంతో తన ఫ్రెండ్ ద్వారా ఫ్రూఫ్ లెస్ సీన్ కార్డు తీసుకొని మృతుడి పెద్ద నాన్నకి ఫోన్ చేసి నేనే చంపింది.50 లక్షల రూపాయలు ఇవ్వాలని ఇవ్వకపోతే మరొకరి చంపుతానని మెసేజ్ చేశాడు అని ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుని సదరు సిమ్ కార్డు నెంబర్ ను ట్రేస్ చేసి ముద్దాయిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు.వీఆర్వో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని నిందితుడిని రిమాండ్ కు తరలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. కేసును తరగతిన చేధించిన పోలీసులును ఎస్పీ అభినందించడం తో పాటు పోలీసులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.


13 views0 comments

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page