నేడు ఆర్యవైశ్య సభ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారం
వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
రెండవ ముంబైగా పేరు గాంచి సిరిపురి పట్టణంగా, దసరా ఉత్సవాల నిర్వహణలో రెండవ మైసూరుగా ప్రఖ్యాతిగాంచిన ప్రొద్దుటూరుకు పట్టణానికి ఆ పేరు రావటానికి అసలు కారకులు ఆర్యవైశ్యులు. శతాబ్దాల చరిత్ర గలిగిన ప్రొద్దుటూరు పట్టణానికి తలమానికంగా నిలిచింది ఇక్కడి 'శ్రీ కన్యాకా పరమేశ్వరి ఆలయం'. ఆలయ చరిత్ర విశిష్టత, ఆర్యవైశ్యుల వృత్తి విధి విధానాల కారణంగా ఇక్కడి వైశ్యులు పలు రంగాలలో రాణిస్తూ అటు పట్టణాభివృద్ధికి, ఇటు ఆర్యవైశ్యుల అభివుద్ధికి తమ వొంతు సహాయ సహకారాలు అందిస్తుండగా, అందులో భాగంగానే పలువురు ఆర్యవైశ్యులు నూట ముప్పై సంవత్సరాల క్రితం స్థాపించబడిన 'ఆర్యవైశ్య సభ'. సభ నియమ నిబంధనలకు లోబడి ఎన్నికయిన సభ్యులు అటు ఆర్యవైశ్య ఆరాధ్య దైవం 'శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి' అమ్మవారిని సేవించుకుంటూ, ఇటు ఆర్యవైశ్య సభ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
అందులో భాగంగా రాబోవు మూడు సంవత్సరాలకు అనగా 2022 నుండి 2025 సంవత్సరానికి గాను పలు రంగాలకు జరిగిన ఆర్యవైశ్య సభ ఎన్నికలలో అధ్యక్షులుగా బుశెట్టి రామ్ మోహన్ రావు, ఉపాధ్యక్షుడుగా జొన్నలగడ్డ రవీంద్ర బాబు, కార్యదర్శిగా మురికి నాగేశ్వర రావు, సహాయ కార్యదర్శిగా మురికి సుబ్రహ్మణ్యం, కోశాధికారిగా మిట్టా శంకర్ బాబు, కార్యవర్గ సభ్యులుగా మరో ఇరవై రెండు మంది ఆర్యవైశ్యులు నేడు వాసవి కన్యాకా పరమేశ్వరి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్బంగా అధ్యక్షులు బుశెట్టి రామ్ మోహన్ రావు మాట్లాడుతూ తనను ఆర్యవైశ్య సభకు ఎన్నుకొన్న ఆర్యవైశ్యులకు ముందుగా కృతజ్ఞతలు తెలిపారు. పాలకవర్గంలోని సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు, రాబోవు రోజుల్లో ఆర్యవైశ్య సభ ద్వారా ఆర్యవైశ్యులకు పలు సేవా కార్యక్రమాల నిర్వహణ, వితరణ, ఆలయ ప్రతిష్ఠ దెబ్బతినకుండా పాలకవర్గ సభ్యులను కలుపుకొని ముందుకు వెళతామని తెలిపారు. రాజకీయాలకు, మతాలకు, కులాలకు అతీతంగా పలువు నాయకులు, వ్యాపారవేత్తలు, పట్టాణ ప్రముఖులు ప్రమాణ స్వీకారానికి హాజరయి ఆర్యవైశ్య సభ అధ్యక్షుడు బుశెట్టి రామ్ మోహన్ రావు ను పాలకమండలి సభ్యులను కలుసుకొని శుభాకాంక్షలు తెలియచేసారు.
Comentários