వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు
గడచిన రెండు రోజులుగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో చోటు చేసుకున్న విభిన్న పరిణామాలపై ఏఎస్పి ప్రేరణా కుమార్ ఐపీఎస్, శుక్రవారం రాత్రి తన కార్యాలయం నుండి పత్రికా ప్రకటన విడుదల చసి పూర్తి వివరాలు వెల్లడించారు
అక్టోబర్ 12వ తేదీన, ప్రొద్దుటూరు నియోజకవర్గ టిడిపి మహిళా అధ్యక్షురాలు భోగాల లక్ష్మీ నారాయణమ్మ పై, ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ నందు దాదాపు 40 లక్షల రూపాయల మేర డ్వాక్రా మహిళా సంఘాల రుణాలు దారిమళ్ళి అవినీతికి పాల్పడిననట్లు ఫిర్యాదు అందటంతో పోలీసులు విచారణ చేపట్టారని, ఇదిలా ఉండగా భోగాల లక్ష్మీ నారాయణమ్మ మరుసటి రోజున ప్రొద్దుటూరు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన మద్దతు కోరగా, పాత్రికేయుల సమావేశంలో ప్రవీణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆమెకు మద్దతు తెలుపుతూ, పార్టీ మద్దతుదారులను వ్యక్తిగత మద్దతుదారులను తన ఇంటి వద్దకు రప్పించుకున్నారని, దాదాపు 40 మంది వ్యక్తులు ప్రవీణ్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నారన్న విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారని, అంతట ప్రవీణ్ రెడ్డి ఇంటిలోంచి బయటకు రావద్దు అని పోలీసులు చెబుతున్న వారి మాటలు పెడచెవిన పెట్టీ హెచ్చరికలు విస్మరించి ఇంటిలోంచి బయటకు వచ్చి, తమ పార్టీ మద్దతుదారులు అనుచర వర్గాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని, అందువలన రెండు గ్రూపుల మధ్య గొడవ జరిగి ఒక వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయని అణారు. అంతట పోలీసులు ప్రవీణ్ రెడ్డి మరో ఐదు మంది పై పై కేసు నమోదు చేశారని, అలాగే వైసిపి కి చెందిన మరో 5 మందిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామని ఏఎస్పీ ప్రేరణా కుమార్ ఐపీఎస్ వెల్లడించారు.
కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో పట్టణంలోని ప్రజల వద్ద సంఘటనకు సంబంధించిన, లేదా సంఘటనను చిత్రీకరించిన వీడియోలు లేదా ఫోటోలు పోలీసు శాఖకు పంపిన యెడల అవి తమ విచారణకు మరింత బలం చేకూర్చే అవకాశం ఉందని ఏఎస్పీ ప్రేరణా కుమార్ ఐపీఎస్ కోరారు.
ఈ సందర్భంగా ఏఎస్పీ ప్రేరణా కుమార్ ఐపీఎస్ ప్రజలకు నాయకులకు పలు పార్టీల కార్యకర్తలకు సూచనలు చేశారు. ఇబ్బందులు గొడవలు ఏమయినా ఉంటే పోలీస్ స్టేషన్ వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయాలని, తమ దగ్గర ఉన్న అసత్య సమాచారాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా లేదా ఇతర మాధ్యమాల ద్వారా ప్రజలలోకి చొప్పించిన ఎడల, పోలీసు శాఖ తగు చర్యలు తీసుకుంటుందని ఏఎస్పీ ప్రేరణా కుమార్ ఐపీఎస్ హెచ్చరించారు. ముఖ్యంగా ఎటువంటి ప్రామాణికాలు లేని యూట్యూబ్ ఛానల్స్ నందు అసత్య ప్రచారాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ప్రసంగాలు ప్రసారం చేయరాదని, అట్లు చేసిన యెడల పోలీసు వారు చర్యలు తప్పవని ముందస్తు హెచ్చరిక జారీ చేశారు.
Neetulu pakkana vallakee .kani police lu patincharu ...