చిన్నతనం నుండే దంత సంరక్షణ అలవర్చుకోవాలి - అటామి
వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
పట్టణంలోని మోడంపల్లె డి.బి.సి.ఎస్ పురపాలక ప్రాధమిక పాఠశాల యందు భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి డెబ్భై అయిదు సంవత్సరాలు ముగించుకున్న సందర్భంగా శుక్రవారం ఉదయం అటామి సంస్థ, మధురం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ వారు సంయుక్తంగా పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు అటామి సంస్థ వారి టూత్ పేస్టు, టూత్ బ్రష్లు ఉచితంగా పంపిణీ చేశారు. మధురం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అధినేత ఏ. వెంకట రమణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రముఖ దంత వైద్య నిపుణులు డా. యోగానందరెడ్డి హాజరవగా, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేణు గోపాల్ రావు, సేల్స్ మాస్టర్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్ మృదుల వేదికను అలంకరించారు.
ఈ సందర్భంగా డా. యోగానంద రెడ్డి మాట్లాడుతూ పిల్లలు చిన్ననాటి నుండే దంత సంరక్షణ అలవర్చుకోవాలని, రోజుకు రెండు మార్లు దంతాలను శుభ్రపరచుకోవాలని. దృఢమైన ఆరోగ్యవంతమైన దంతాలు మనిషికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయని అన్నారు. అనంతరం అటామి సంస్థకు చెందిన ఏ.వెంకట రమణ మాట్లాడుతూ తమ సంస్థ అత్యుత్తమ పరిమాణాలతో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తయారు చేస్తున్న పలు వస్తువులలో ప్రొపొలిస్ టూత్ పేస్ట్, లోహాన్ టూత్ బ్రష్లు పాఠశాల విద్యార్థులకు వితరణ చేయటం తనకు ఎంతో సంతోషాన్నిస్తున్నదని, పిల్లలు తమ దంత సంరక్షణ పై నేటి నుండి శ్రద్ద వహించాలని హితువు పలికారు.
కార్యక్రమంలో అటామి సంస్థ లీడర్ లక్ష్మి నారాయణ(లక్ష్మణ్), అవేక్ అండ్ అరైజ్ సంస్థ ప్రిన్సిపాల్ శివాజీ శంకర్, మురళీశ్వర్ రెడ్డి, లత, పాఠశాల బోధనా సిబ్బంది, బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments