ఆటో డ్రైవర్ కూతురికి 524
వై.ఎస్.ఆర్ జిల్లా, మైదుకూరు
చాపాడు మండలం, తండ్రి ఒక సాధారణ ఆటో వాలా, తన కూతురుని చదివించాలి జీవితంలో తన బిడ్డ ప్రయోజకురాలిగా స్థిరపడాలి అనే తన కోరిక, అహర్నిశలు కుటుంబం కోసం శ్రమిస్తూ, కూతురు చదువు కోసం పడరాని పాట్లు పడుతూ ఆటో డ్రైవర్ గా జీవితాన్ని సాగిస్తున్నాడు గురునాథ. తండ్రి శ్రమకు తగ్గ ఫలితాన్ని ఆ కూతురు సాధించిన ఫలితమే పదవ తరగతిలో 524 మార్కులు. రఘునాధ, గౌరీ ల కూతురు నిఖిత మండల కేంద్రమైన చాపాడులోని కస్తూరిబా గాంధీ గురుకుల పాఠశాలలో పడవ తరగతిలో నిఖిత (హల్ టికెట్ 2222122005) 524 మార్కులు (93 శాతం) సాధించినట్లు పాఠశాల హెచ్.ఏం మల్లేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. నిఖిత మొదటి స్థానం సాధించినందుకు తమకు తమ పాఠశాలకు ఎంతో గర్వకారణమని కొనియాడారు. పాఠశాల యందు 27 మంది విద్యార్థినులు పరీక్షలకు హాజరు కాగా 25 మంది ఉత్తీర్ణత సాధించారని ఆమె వివరించారు.
Comentários