వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు పట్టణంలోని ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా పట్టణంలోని పలు కూడళ్ల వద్ద ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తూ ఆటోవాలాలు చేసే హల్చల్ అంతా ఇంతా కాదు. వేలకొద్దీ ఆటోలు నియోజకవర్గ పరిధిలో తిరుగుతున్నాయి అంటే అతిశయోక్తి ఏమీ కాదు, తుప్పు పట్టిన పాత ఆటోలను కూడా వీరు ప్రయాణానికి ఉపయోగిస్తుండడం అటు ప్రయాణికులను ఇటు పాదాచారులు, వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తుంది.
ఆదివారం మధ్యాహ్నం ప్రొద్దుటూరులోని రిలయన్స్ పెట్రోల్ బంకు వద్ద అతి వేగంతో వస్తున్న ఆటో ఒక్కసారిగా ముందరి టైర్ పంచర్ కావడంతో ఒక ప్రక్కగా వాలుతూ వెనకాలే వస్తున్న ద్విచక్ర వాహనదారడు ఆటోను ఢీకొని క్రింద పడగా బైకు పాక్షికంగా దెబ్బతిని అతనికి గాయాలయ్యాయి. ఆర్సీలు కూడా లేని ఆటోలు మరీ ముఖ్యంగా, నైపుణ్యంలేని ఆటో డ్రైవర్లు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ప్రతినిత్యం ఏదో ఒకచోట ఆక్సిడెంట్లు చేస్తూ అటు ప్రజలను, ఇటు వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎందుకు పనికిరాదని పక్కన పడేసిన ఆటోలను కూడా ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఫిట్నెస్ సర్టిఫికెట్ లాంటి అనుమతులు పొందకుండా ఆటోవాలాలు తమ ఇష్టానుసారంగా నడుపుతూ ప్రజల ప్రాణాలకే ముప్పు తెస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు వెంటనే పట్టణంలోని ఆటోలను తనిఖీలు చేసి రికార్డులు లేని ఆటోలను సీజ్ చేసి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇటువంటి ఆటో డ్రైవర్లపై తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Comentarios