అవెన్యూ ప్లాంటేషన్ పనులను పరిశీలించిన
అంబుడ్స్మెన్(ప్రతేక అధికారి).
---అవెన్యూ పై సంతృప్తి వ్యక్తం.
---పూర్తి వేతనం పొందడంలో ఉపాధి కూలీలకు సూచనలు.
ఈ రోజున అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలం పరిధిలోని తుమ్మకొండ గ్రామ పంచాయతీ నందు ఉపాధి హామీ పథకం ద్వారా రోడ్డుకి ఇరువైపులా చేపట్టిన అవెన్యూ ప్లాంటేషన్ పనిని జిల్లా అంబుడ్స్మెన్ అధికారులు పరిశీలించి సంతోషం వ్యక్తం చేశారు.
అదేవిదంగా కంపసముద్రం గ్రామపంచాయతీ నందు వేతనదారులతో అంబుడ్స్మెన్ అధికారులు మాట్లాడుతూ కూలీల సమస్యలు అడిగి తెలుకున్నారు. పని ప్రదేశం లో వేతనదారులకు రోజుకు 257/- వేతనం రావాడానికి ఎలా పని చెయ్యాలో, ఎన్ని గంటలు పని చెయ్యాలో వివరించడం జరిగింది.
ఈ కార్యక్రమం లో జిల్లా అంబుడ్స్మెన్ అధికారి సాంబశివారెడ్డి , సీనియర్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ విజయకుమార్ , జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ సుధాకర్ , ఎ పి ఓ చంద్రకళ , ఈసీ ఓబులేసు లు పాల్గొన్నారు.
Comments