విద్యార్థుల భవిష్యత్తు పై అవగాహన సదస్సు
రాజంపేట, విద్యార్థుల భవిష్యత్తు పై అవగాహన సదస్సు ను "ఉయ్ ఆర్ విత్ యు చారిటబుల్ ట్రస్టు" వారు శనివారం బోయినపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో "భవిష్య" మరియు "స్వెచ్ఛ (కౌమారదశ)" అంశంపై కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉయ్ ఆర్ విత్ యు చారిటబుల్ ట్రస్టు జిల్లా అధ్యక్షుడు వెల్లాల లింగ భాను ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు విద్యా దశ అనంతరం తమ భవిష్యత్తు సక్రమమైన దారిలో నడిపించుకోవడానికి అనేక రకాలైన జీవనోపాధి పద్దతులు ఉన్నాయని కొన్నిటిని ఉదహరించారు. మనం చేసే ప్రతి పని ఇతరులకు ఉపయోగపడేలా ఉండాలని అన్నారు. సమాజ సేవకోసం విద్యార్థులు చేసే సంకల్పానికి తమ సంస్థ ఎల్లవేళలా తోడ్పాటు నిస్తుందని తెలియజేశారు.
అనంతరం ట్రస్ట్ ఉపాధ్యక్షులు స్నేహలత కౌమారదశ గురించి తెలియజేశారు. ప్రాజెక్టు టీమ్ లీడర్ లు లోకేష్ రెడ్డి, టి.అజిత్ కుమార్ లు మాట్లాడుతూ పదవ తరగతి అనంతరం తీసుకోవలసిన నిర్ణయాలు వాటి అమలుకు కృషి చేయవలసిన విధానమూ, ప్రభుత్వం నుండి వచ్చే స్కాలర్ విదానాలు, వాటిని పొందటానికి తీసుకోవలసిన పద్దతులు గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సంయుక్త కార్యదర్శి కార్తీక్, హాజీ, దీపక్, చరన్, రేష్మ బాను మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
Comments