ఆటో డ్రైవర్లు తప్పకుండా ట్రాఫిక్ నియమాలు పాటించాలి - జూనియర్ న్యాయమూర్తి కే లత
ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలు గురించి న్యాయ విజ్ఞాన సదస్సు ను నిర్వహించిన మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ , మరియు నందలూరు జూనియర్ న్యాయ మూర్తి కే.లత. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మోటార్ వెహికల్ చట్టం గురించి అందులో ఉన్న నేరాలు, శిక్షల గురించి కులంకషంగా వివరించారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, ట్రాఫిక్ రూల్స్ అధిగమిస్తే శిక్ష తప్పదని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనం నడిపితే ఆరు నెలలు జైలు శిక్ష, పదివేల రూపాయలు జరిమానా విధించబడిన తెలిపారు. అలాగే లైసెన్స్ లేకుండా వాహనం నడపడం, ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడపడం, అధికంగా ప్యాసింజర్స్ ని ఎక్కించుకోవడం, ఎమర్జెన్సీ వెహికల్ కి దారి ఇవ్వకుండా పోవడం, కండిషన్ లేని వాహనాలను నడపడం అధిక వేగంతో వాహనం నడపడం మరియు లైసెన్స్ లేని వ్యక్తి వాహనం ఇవ్వడం నేరాలని తెలిపారు. ప్రతి ఒక్కరు చట్టాన్ని అనుసరిస్తూ రూల్స్ ను పాటిస్తూ దేశానికి ఉపయోగపడాలని తెలియజేశారు. మద్యం సేవించడం వలన నష్టాల గురించి తెలిపారు. చట్టాలని పాటించకపోతే నేరాలు ఆహ్వానించిన వారు అవుతారని తెలిపారు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నరసింహులు మాట్లాడుతూ రూల్స్ ప్రతి ఒక్కరు పాటించాలని తెలిపారు. ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, మన్నూరు మంజునాథ్ రెడ్డి మాట్లాడుతూ చట్టాన్ని అందులో ఉన్న రూల్స్ నీ పాటించాలని లేదంటే శిక్ష తప్పదని తెలిపారు.
Comentários