నిజం గెలిచింది - బాబుకు బెయిల్ వచ్చింది
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పై పెట్టిన స్కిల్స్ డెవలప్మెంట్ కేసులో నిజాలు నెగ్గు తేలయని 53 రోజులు జైల్లో ఉంచిన ఆయనపై చేసిన ఆరోపణలు ఒకటి కూడా రుజువు చేయలేదని ప్రభుత్వం కక్ష పూరిత రాజకీయాలు కు ఇది నిదర్శనం కాదా అని రాజంపేట తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు మేడ విజయ శేఖర్ రెడ్డి ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం అధికారాన్ని అడ్డుపెట్టుకొని సమస్యలు ఎత్తిచూపుతున్న వారిపై అక్రమ కేసులను బలాయించడం మామూలుగా మారిపోయిందని ఆయన అన్నారు సిఐడి వాళ్లు బాబు అరెస్టులు చూపిన మక్కువ కోర్టుకి సాక్షాలు సమర్పించడం లో ఎందుకు చూపలేక పోయారని ప్రభుత్వం చేతిలో అధికారులు కీలుబొమ్మ లాగా మారిపోయారని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు అంటే దేశంలోనే అభివృద్ధికి మారుపేరని ఆయన పైన పెట్టిన ఈ అక్రమ కేసులు నిలవడం అసాధ్యమని ఎప్పటికైనా నిజాలే గెలుస్తాయని మరోసారి రుజువైందని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో మండల లోని తెలుగు దేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments