దళితులకు సముచిత స్థానం కల్పించిన వారికే మద్దతు - సుధాకర్
కడప జిల్లా, ప్రొద్దుటూరు
శుక్రవారం ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి అమ్ముళ్లదిన్నె సుధాకర్ ఆధ్వర్యంలో మాజీ భారత ఉప ప్రధాని, స్వాతంత్ర్య సమరయోధుడు, స్వర్గీయ బాబూ జగ్జీవన్ రామ్ 116 జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు, బాబూ జగ్జీవన్ రామ్ చిత్రపటానికి దళిత నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సుధాకర్ మాట్లాడుతూ, బాబూ జగ్జీవన్ రామ్ స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలి కార్మిక మంత్రిగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. భారత్ - పాకిస్తాన్ యుద్ధంలో భారత రక్షణ మంత్రిగా పనిచేశారన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో బాబూ జగ్జీవన్ రామ్ ఉత్సాహంగా పాల్గొనేవారని ఆయన గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం బాబూ జగ్జీవన్ రామ్ కు భారతరత్న ఇచ్చి గౌరవించాలన్నారు.
అనంతరం ప్రొద్దుటూరులో దళితులను గత ప్రభుత్వాలు ఓటర్లుగానే చూశారు తప్ప రాజకీయంగా తగిన ప్రాధాన్యత, గౌరవం కల్పించలేదని, ఈ ఎన్నికలలో ఏ పార్టీ అయితే తమను గుర్తించి మున్సిపల్ పరిధిలో కౌన్సిలర్ స్థానాలు, నామినేటెడ్ పదవులు ఇచ్చి గౌరవిస్తారో వారికి తమ మద్దతు తెలియజేస్తామని అన్నారు. కార్యక్రమంలో ఎస్సీ జన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పసుపులేటి శివకృష్ణ, రాష్ట్ర అధ్యక్షులు పెద్దిరాజు, ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర యువసేన ఉపాధ్యక్షుడు నారాయణస్వామి, పలువురి ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.
Comments