వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు
క్రమం తప్పకుండా ప్రతినెల ఆ గర్భవతి పట్టణంలోని గాంధీ రోడ్డు నందుగల ఒక ప్రైవేటు హాస్పిటల్ లో చెకప్ కొరకు వస్తుండగా, బుధవారం ఉదయం నొప్పులు రావడంతో బంధువులు భర్తతో కలిసి హాస్పిటల్ చేరుకుంది, కాగా పరీక్షలు నిర్వహించిన మహిళా డాక్టర్ గర్భవతి కరమల రోజా కు ఇంజక్షన్ చేసి, గురువారం ఉదయం మరోమారు పరీక్షకు హాజరు కావాలని అంటూ చెప్పినట్లు, ఇదే క్రమంలో గురువారం ఉదయం హాస్పిటల్ కు చేరుకున్న గర్భవతి రోజా ఆమె బంధువులకు చేదువార్త ఎదురైంది. స్కానింగ్ పరీక్షలు నిర్వహించగా అప్పటికే గర్భంలోని బిడ్డ చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ వార్త విన్న బంధువులు హాస్పిటల్లో నిరసన తెలిపారు. నిర్లక్ష్యానికి పూర్తి బాధ్యత ఆ ప్రైవేటు ఆసుపత్రి డాక్టర్లు కారణమని వారిని నిలదీశారు.
Comments