సరస్వతి అలంకారంలో శ్రీ భద్రకాళి అమ్మవారు.
---గణపతి, రుద్ర, చండీ హోమాలు నిర్వహించిన ఆలయ కమిటీ.
మూలా నక్షత్రంలో భాగంగా చిట్వేలు పరిధిలోని పాత చిట్వేలు గ్రామం నందు మట్లి రాజులచే నిర్మితమై శతాబ్దాల గొప్ప చరిత్రను కలిగి; తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్న శ్రీ వీరభద్ర సమేత భద్రకాళి దేవాలయం నందు ఆదివారం శ్రీభద్రకాళి అమ్మవారు చదువుల తల్లి సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
ఉదయం మొదలుకొని ఆలయ కమిటీ సభ్యులు,ఆలయ అర్చకులు గణపతి హోమం, రుద్ర హోమం, చండీ హోమం తదితర కార్యక్రమాలు నిర్వహించి వివిధ రకాల పూలతో, పట్టు వస్త్రాలతో అమ్మవారిని సరస్వతి దేవిగా అలంకరించి ప్రత్యేక పూజలను నిర్వహించగా పెద్ద ఎత్తున భక్తులు, మహిళలు ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు. యావత్ భక్తాదులందరికి తీర్థ ప్రసాదాలను అందించారు.
Comments