వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
సోమవారం స్థానిక నేతాజీ నగర్ 3వ లైన్ నందు నివాసముంటున్న గడ్డమీది బాలనాగమ్మ హత్యోదంతం సంచలనం సృష్టించగా, గంటల వ్యవధిలోనే కేసుని ఛేదించి నిందితుడిని అరెస్టు చేసిన ప్రొద్దుటూరు వన్ టౌన్ సిఐ శ్రీకాంత్, ఎస్సై మంజునాథ్ ఇతర సిబ్బందిని ప్రొద్దుటూరు డిఎస్పి డి. మురళీధర్ అభినందించారు. ఈ సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం స్థానిక డిఎస్పీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో డిఎస్పి మురళీధర్ మాట్లాడుతూ, మృతురాలి భర్త గడ్డమీద రామయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నంబర్ 237/2024 U/s 332(a) 103(1) సెక్షన్ల కింద ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసిన పోలీసులు.
సోమవారం రాత్రి సీకే దీన్నే మండలం, ఊటుకూరు గ్రామానికి వెళ్లి ముద్దాయి జయచంద్రుడిని అతని ఇంటి వద్ద అదుపులోకి తీసుకొని ప్రొద్దుటూరు వన్ టౌన్ సీఐ వద్ద హాజరుపరిచారని, కుటుంబ కలహాలు మనస్పర్ధలు నేపథ్యంలోనే జయచంద్రుడు బాలనాగమ్మను హత్య గావించినట్లు డిఎస్పి తెలిపారు. వివరాల్లోకి వెళితే, 71 సంవత్సరాల గడ్డమీది నాగమ్మ ఆమె కుమారుడు సురేష్ నేతాజీ నగర్లో నివాసం ఉంటున్నారు, వీరు చాపాడు మండలం కేతవరం గ్రామానికి చెందిన వారు కాగా, సదరు సురేష్ ప్రొద్దుటూరు మున్సిపాలిటీ నందు సర్వేయర్ గా పనిచేస్తున్నాడు. గత రెండు సంవత్సరాల క్రితం ఊటుకూరు గ్రామానికి చెందిన బనగాని జయచంద్రుడు తన కుమార్తె పెళ్లి సంబంధం మాట్లాడే విషయమై కేతవరం గ్రామంలోని సురేష్ ఇంటికి వచ్చినట్లు, అనంతరం సురేష్ కుటుంబం కూడా జయ చంద్రుడు ఇంటికి వెళ్లి పెళ్లి సంబంధం మాట్లాడినట్లు, అయితే కొన్ని కారణాల వలన సంబంధం సదరు జయచంద్రుడుకు ఇష్టం లేకపోయిందని, ఇదిలా ఉండగా జయ చంద్రుడు కుమార్తె ఉషా నాగమణిష అలాగే బాలనాగమ్మ కుమారుడు సురేష్ ఒకరినొకరు ప్రేమించుకున్నారని, ఈ నేపథ్యంలో 2024 మార్చి నెలలో సురేష్ తన కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నాడని, ఈ వివాహం జయ చంద్రుడికి ఇష్టం లేక సదరు సురేష్ కుటుంబం పై కక్ష పెంచుకొని, సోమవారం ఊటుకూరు నుంచి మోటార్ సైకిల్ పై బయలుదేరిన జయ చంద్రుడు మధ్యాహ్నం 3:45 నిమిషాల ప్రాంతంలో తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్ ను బాలనాగమ్మ పై పోసి నిప్పు అంటించగా ఆమె అక్కడికక్కడే కాలిన గాయాలతో మృతి చెందిందని, బాలనాగమ్మ తన కుమార్తెకు దగ్గరుండి కొడుకు సురేష్ తో పెళ్లి చేయించిందన్న కారణంగానే కక్ష పెంచుకొని సదరు బాలనాగమ్మను జయచంద్రుడు అంతమొందించాడని తెలిపారు. ఈ క్రమంలో ముద్దాయిని అరెస్టు చేసి కేసును చేదించిన ప్రొద్దుటూరు వన్ టౌన్ సీఐ శ్రీకాంత్, ఎస్సై మంజునాథ్, హెడ్ కానిస్టేబుల్ జగన్ నాయక్, రహంతుల్లా, జగన్నాథ్ రెడ్డి, తిరుపతయ్య, గంగాధర్, సూర్యుడు, రవీంద్ర నాయక్, హోంగార్డ్ రంజిత్ రెడ్డి, చిన్న పెద్దన్న లను డీఎస్పీ డి.మురళీధర్ అభినందించి వారికి తగు రివార్డులకు సిఫారసు చేశారు.
Kommentarer