సియం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంటి దగ్గరే సమస్యను పరిష్కరించేదుకే గడప గడపకు మన ప్రభుత్వం అని, చెప్పాడంటే చెస్తారంతే అనే మాటకు కట్టుబడి ఉంటామని వైయస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు వై.బాలనాగి రెడ్డి అన్నారు.
బుధవారం కోసిగి మండల పరిధిలోని దొడ్డి గ్రామంలో గడప గడపకు కార్యక్రమంలో భాగంగా వైయస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు మరియు ఎమ్మెల్యే బాలనాగి రెడ్డి పర్యటించిన అనంతరం, సోమవారం ఉదయం కోసిగి మండలం దుద్ది గ్రామ సచివాలయం పరిధిలోని మజరా గ్రామం కోల్మాన్ పేట గ్రామంలో పర్యటించినప్పుడు తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు మహిళలు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇంటిస్థలం కావాలని అడగ్గా,వెంటనే ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తాహాశీల్దార్ రుద్రగౌడ్ తో మాట్లాడి,సమస్యను పరిష్కరించాలని ఆదేశించిన 72 గంటల్లోనే కోల్మాన్ పేట లబ్దిదారులు మదిరె. అంజినమ్మ,మదిరె నర్సమ్మ, గుడిసె తిప్పమ్మ,కామనదొడ్డి శాంతమ్మ,కోసిగి పక్కిరమ్మ లకు పట్టా అందజేశారు. చెప్పామంటే చేస్తామంతే అనే మాట ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఎన్నో దశాబ్దాల కల నేటితో నిజం చేయడంతో లబ్దిదారులు సంతృప్తి వ్యక్తం చేశారు.
Comentarios