top of page
Writer's picturePRASANNA ANDHRA

టెన్త్ పరీక్షలు ప్రశాంతంగా జరగడానికి అందరూ సహకరించాలి - బలిరెడ్డి

అగనంపూడి ప్రసన్న ఆంధ్ర వార్త


టెన్త్ పరీక్షలు ప్రశాంతంగా జరగడానికి అందరూ సహకరించాలి ఏ డి సి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ

అగనంపూడి సీడబ్ల్యూసీలో అగనంపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పేరెంట్స్ కమిటీ కో ఆప్షన్ డైరెక్టర్ బలిరెడ్డి శీను ఆధ్వర్యంలో జరిగిన గ్రామ పెద్దలు సమావేశంలో లో బలిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి ఉన్నత చదువులకు ,జీవిత గమ్యానికి దశ దిశ నిర్దేశించే పదో తరగతి పరీక్షలు. అగనంపూడి టెన్త్ క్లాస్ పరీక్షా కేంద్రంలో పినమడక ఉన్నత పాఠశాల, ఏ బి ఎస్ పాఠశాల ,అగనంపూడి ఉన్నత పాఠశాల నుండి 241మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని గతంలో వలే కాకుండా ఏడు రోజులే పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని.బెంచికి ఒకరు చొప్పున 24 పేపర్లతో బుక్ లెట్ ఇవ్వడం జరుగుతుందని బిట్ పేపరు ఉండదని అన్నారు పరీక్షా కేంద్రంకి వచ్చే విద్యార్థులకు, ఇన్విజిలేటర్స , పోలీసు తమ విధి నిర్వహణకు ఎటువంటి ఆటంకం లేకుండా స్థానిక పెద్దలు గ్రామ ప్రజలు సహకరించాలి. పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు సౌకర్యంగా మంచినీరు, ఫ్యాన్లు ,మెడికల్ సదుపాయం ఏర్పాటు జరిగింది. కావున విద్యార్థులు ఎటువంటి ఒత్తిడి చెందకుండా స్వేచ్ఛగా పరీక్షలు విజయవంతంగా రాయాలని అభినందనలు తెలియజేశారు.

విశాఖ జిల్లా లైన్స్ క్లబ్ చైర్ పర్సన్ కడిమి హనుమంతరావు మాట్లాడుతూ ఈ ఏడాది అగనంపూడి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల లో పరీక్ష కేంద్రము తొలగించాలని ప్రతిపాదన తెచ్చారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం కృష్ణారావు ,ఏ డి సి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ విద్యా శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి పరీక్ష కేంద్రాన్ని యధావిధిగా కొనసాగించడానికి కృషి చేసినందుకు అభినందనలు తెలియజేశారు.

ఈ సమావేశములో దాన బోయినపాలెం గ్రామ పెద్ద ఎల్ వి రమణ, వై ఎస్ ఆర్ సి పి సీనియర్ నాయకులు దానబాల అప్పలనాయుడు, సీడబ్ల్యూసీ కార్యదర్శి వంకర రాము తదితరులు పాల్గొన్నారు.

37 views0 comments

Comentarios

Obtuvo 0 de 5 estrellas.
Aún no hay calificaciones

Agrega una calificación
bottom of page