మొదటి సంవత్సరంలో మెరిసిన బాలు వైష్ణవి.
--తిరుపతి నారాయణ లో ప్రథమ స్థానం.
--నారాయణ కళాశాల, పూర్వపాఠశాల అక్షర హై స్కూల్ యాజమాన్యం అభినందనలు.
---తల్లిదండ్రులలో ఉప్పొంగిన సంతోషం.
గత నెలలో వెలువడిన పదవ తరగతి పరీక్ష ఫలితాల తోపాటు,ఈరోజు వెలువడ్డ ఇంటర్ ఫలితాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా బాలికలదే పైచేయిగా నిలిచింది.
2021-2022 విద్యా సంవత్సరానికి గానూ ఈరోజు వెలువడిన ఇంటర్మీడియట్ మొదటి ఏడాది పరీక్షా ఫలితాలలో అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం, కడియం వారిపల్లే గ్రామానికి చెందిన బాలు వెంకటేశ్వర్లు, ఉషా దంపతుల పుత్రిక అయిన బాలు వైష్ణవి తిరుపతిలోని నారాయణ కాలేజ్ నందు ఇంటర్ ఎంపీసీ లో ప్రథమ సంవత్సరం అభ్యసిస్తూ ఈ రోజున ప్రకటించబడ్డ ఫలితాలలో 470 మార్కులకు గానూ 461 మార్కులు సాధించి తిరుపతి కళాశాలలో మొదటి స్థానంలో నిలిచింది.
వైష్ణవి కి అభినందనలు: కాలేజీ యాజమాన్యం, పదవ తరగతి చదివిన పూర్వ పాఠశాల చిట్వేలు మండల పరిధిలోని అక్షర హై స్కూల్ వైష్ణవికి , వారి కుటుంబ సభ్యులకు అభినందనల వెల్లువలు తెలియపరిచారనీ వారి తల్లిదండ్రులు తెలియపరిచారు.
విజయంపై వైష్ణవి మాటల్లో: అధ్యాపకుల బోధనను అర్థం చేసుకుంటూ చక్కని ప్రణాళికలతో ముందుకెళితే అందరికీ సాధ్యమవుతుందని..రేపటి సంవత్సరంలో కూడా మంచి మార్కులు సాధించి భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను చేరుకుంటానని, తన చదువుకు సహకరిస్తున్న తన తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు, ఎప్పటికప్పుడు చదువులో మెళకువలు నేర్పుతున్న ఉపాధ్యాయులకు, పునాదులు వేసిన పూర్వపు పాఠశాల అక్షర యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు.
Comentarios