చెరువు నీరు పూర్తిగా నిలుపుదల తో నీరందక అరటి బొప్పాయి రైతుల రోదన.
*వరి అరటి బొప్పాయి నిలువునా ఎండుతున్న వైనం.
*రాతలు అవాస్తవాలైనా నీటిని నిలిపిన అధికారులు.
*ఏరుగుండా నీరు సాగితే గాని మా పంట పండదు అంటున్న రైతన్నలు.
ఆ ఏరు సాగితే గాని సమీప గ్రామాల రైతుల పొలాల్లో పంటలు పండవు. గతంలో కురిసిన వర్షాలతో పూర్తిస్థాయిలో నిండిన చెరువు నీటితో ఆనందపడి వాణిజ్య పంటలు సాగు చేసిన రైతులు నేడు.. కొందరి రాతలు, కొందరి చేతల తో తమ పంటకు నీరు అందక కన్నీరు కారుస్తున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే చిట్వేలు మండలం చెర్లోపల్లి సమీపాన మట్లి రాజుల కాలంలో సుదీర్ఘ విస్తీర్ణంతో వెలసి కడప జిల్లాలోని రెండవ అతి పెద్ద చెరువు గా పేరుగాంచిన ఎల్లమ్మ రాజు చెరువు కింద పంటలు సాగు చేసిన రైతన్నల వేదన ఇది. గత కొద్ది రోజుల క్రితం నీరు బయటకు పోతుంది కేవలం చేపలు పట్టేందుకు అన్న కొన్ని అవాస్తవ రాతలతో అధికారులు చర్యలు తీసుకుని పూర్తిస్థాయిలో నీటిని బయటకు పోనివ్వకుండా ఆపుదల చేశారు.
సదరు చెరువు ఆయు కట్టకింద అటు మైలపల్లి రాచపల్లి వాసులు ఇటు కెఎస్ అగ్రహారం వాసులు వరి పంటను అరటి బొప్పాయి పంటలను సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేసారు. చెరువు నుంచి నీరు సాగితే కానీ తమ పంట తడవదు. ప్రస్తుతం బొప్పాయి,అరటి ఏపుగా పెరిగి కాయ దశలో ఉండగా వరి పంట వెన్ను దశలో ఉంది. అధికారులు వీటన్నింటినీ గమనించక కేవలం రాతలకు ఫోను ద్వారా మాటలకు స్పందిస్తూ నీటిని ఆపేసి రైతులకు కంట తడి నింపుతూ పంటలను నిలువునా చంపుతున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇకనైనా ఆఫీసుల కే పరిమితం కాక ఇటు వ్యవసాయ అధికారులు అటు నీటిపారుదల అధికారులు మాగాణిని సమీక్షించి ఎంతవరకు నీటి అవసరం ఉంది, ఎన్ని రోజుల పాటు ఉంది అన్న విషయాలను ముఖ్యంగా పరిశీలించి తదుపరి చర్యలను గైకొని మాకు న్యాయం చేయాలని సదరు రైతన్నలు మూకుమ్మడిగా వినత ల రూపంలో అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments