అరటి రైతులు వర్షాకాలంలో జాగ్రత్తలు తప్పనిసరి.
---సిగతోక ఆకు మచ్చ తెగులుతో అప్రమత్తంగా ఉండాలి.
ఉద్యానవన శాఖ అధికారి
ఆసియా వెల్లడి.
అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలంలో ఉద్యానవన పంటలయిన మామిడి, బొప్పాయి, అరటి,నిమ్మ లాంటి పంటలు ఎక్కువగా సాగులో ఉన్నాయి.
కాగా ప్రస్తుతం అధిక వర్షపాతం వల్ల చిట్వేలు మండల పరిధిలో అరటి సాగు చేసే రైతులు ప్రత్యేక మెలకువలు పాటించి అధిక దిగుబడి సాధించాలని ఉద్యానవన శాఖ అధికారి ఆసియా పేర్కొన్నారు.
తానూ తెలిపిన వివరాల ప్రకారం అరటి పండులోని రకాలైన అమృతపాణి, సుగంధాలు, రెడ్ బనానా, లాంటి అరటి రకాలు మండల పరిధిలో సాగులో ఉన్నాయని; గతంలో...సిగతోక , ఆకు మచ్చ తెగులు లాంటివి ఎక్కువగా వచ్చేవి కావనీ.. ప్రస్తుతం ఈ పంటలకు కూడా ఈ వ్యాధి ఎక్కువగా ఆశిస్తుండడంతో రైతులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అందుకు అనుగుణంగానే తమ శాఖ తరపున అన్ని మండలాలలో చిట్వేలి, ఓబులవారిపల్లి, పుల్లంపేట, టు కోడూరు ప్రత్యేక ఛాంపియన్లు ఏర్పాటు చేసి అరటి రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుందని ఆమె తెలిపారు.
ఆకుపచ్చ తెగులు వ్యాధి యొక్క లక్షణాలు: మొదట ఆకు మచ్చ తెగులు ముందుగా కింద వరకు ఆకులపైన ఉంటుంది సమాంతరంగా పసుపుపచ్చని ఈ మచ్చలు క్రమంగా పెరిగి మచ్చ గోధుమ రంగులోకి మారుతుంది. ఈ మధ్యలో ఒకదానితో ఒకటి కలిసిపోయి ఆకు ఎండి పోయి మచ్చలు వస్తాయి.
ఈ తెగులు ఆశించడం వల్ల దిగుబడి, నాణ్యత తగ్గుతాయని కాయ ముందుగా పండుబారిపోయి పూర్తిగా ముదరక ముందే పండిపోయి గెలలు కోయవలసి వస్తుంది కాబట్టి; వ్యాధి తో ఎండిపోయిన ఆకులను తొలగించి పూర్తిగా కాల్చివేయాలన్నారు.
నివారణ చర్యలు: నివారణలో భాగంగా వర్షాలు కురిసినప్పుడు ముందస్తు జాగ్రత్తగా 2.5 గ్రాములు మ్యాంకో జెట్ రెండు మిల్లీ లీటర్లు క్లోరోతాలోనీల్ ఒక లీటర్ నీటిలో కలుపుకుని పిచికారి చేయాలనీ అరటి రైతులు పూర్తిగా తడిచేలా ఈ మందు ద్రావణాన్ని మరలా మరలా 25 రోజుల వ్యవదిలో 4 నుంచి 5 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెగులును నివారించుకోవచ్చనీ ఉద్యాన శాఖ అధికారి ఆసియా తెలిపారు.
Comentarios