బి ఓ ఐ లో రూ.50 కోట్లతో లావాదేవీలు - జోనల్ మేనేజర్ సోమశేఖర్
ప్రొద్దుటూరులో బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభించిన రెండు సంవత్సరాల వ్యవధిలోనే రూ.50కోట్ల వ్యాపార లావాదేవీలు చేపట్టడం జరిగిందని జోనల్ మేనేజర్ సోమశేఖర్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం మైదుకూరు రోడ్డులోని బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతాదారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎనబై రెండు బ్రాంచీలు ఉన్నాయని, ప్రొద్దుటూరులో శాఖను ఏర్పాటు చేసిన రెండు సంవత్సరాలలో రూ.50 కోట్ల లావాదేవీలు చేపట్టడమే కాకుండా రుణాలు అందించడంలో రెండవ స్థానంలో ఉందన్నారు. కేంద్ర ప్రభు త్వం ప్రవేశ పెట్టిన ముద్ర రుణాలు, అలాగే అగ్రికల్చర్, ఇన్ఫ్రా, ఎడ్యుకేషన్ రుణాలను అందిస్తున్నామని తెలిపారు. అలాగే హౌసింగ్, వెహికల్స్ కొనుగోలు చేసేందుకు రుణాలు అందించడమే గాకుండా చిరు వ్యాపారులకు సైతం తమ బ్యాంకు ద్వారా రుణాలను అందిస్తామని తెలిపారు.
అనంతరం ప్రొద్దుటూరు బ్రాంచ్ మేనేజర్ అనిల్, అభిలాష్ కు రెండవ స్థానం లభించిన ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ఏరియా మేనేజర్ సీతారాం మాట్లాడుతూ తమ బ్యాంకు ద్వారా అందించే ప్రతిరుణాన్ని ప్రజల కోసం అందుబాటులోకి తెచ్చా మని లక్ష రూపాయల మొదలు కోట్లాది రూపాయల రుణాలను అందజేస్తున్నా మని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఖాతాదారులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
コメント