తెల్లవారుజామున మూడు గంటలకే బార్లు తెరుస్తాం మా ఇష్టం...
పేద, దిగువ మధ్యతరగతి కూలీలే ప్రధాన ఆదాయ వనరులు...
నిబంధనలకు తూట్లు, అడ్డదారిలో అమ్మకాలు...
మద్యానికి బానిసై తెల్లవాఱుజామునుండి బార్ల దగ్గర పడిగాపులు...
నామమాత్రపు చర్యలు కూడా సూన్యం, నిద్ర మత్తు వీడని అధికారులు...
వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
ఉదయం ఆరు గంటలకె మా బారు తెరిచామని అడుగుతారేంటి, కావాలంటే తెల్లవారుజామున మూడు గంటలకే మా బార్ బార్లా తెరుస్తాం... కోట్లు గుమ్మరించాం.. ఎదజల్లాము... వేరుకుంటున్నాం... పంచుకుంటాం... ఇదీ ప్రొద్దుటూరులోని పలు బార్ అండ్ రెస్టారెంట్ల పరిస్థితి. నిబంధనలకు తూట్లు పొడిచి, పేద, దిగువ మధ్యతరగతి కూలీలే ప్రధాన ఆదాయ వనరులుగా చేసుకొని, ఎదేశ్చగా, ఇష్టానుసారంగా గత కొన్ని నెలల నుండి విచ్చలవిడిగా సాగుతోన్న దందా. అడిగే నాధుడే లేదు, ప్రశ్నించే అధికారులు కరువయ్యారు, ఇక చర్యలు అంటారా ఆ మాట ఇప్పుడు ఎందుకు లేండి! తెల్లవారుజామున కోడి కూసే సమయానికి ఎవరు ముందు బార్ తెరుస్తారన్నది ఇక్కడ పోటీ, పోటీతత్వం నిబంధనలు పాటించటంలో చూపితే అటు సమాజానికి ఇటు మందుబాబులకు మేలు చేసినవారము అవుతామేమో, కిరీటాలు మోయవలసి వస్తుంది అనే భీతి. ప్రధానంగా ప్రొద్దుటూరులోని పలు బార్ అండ్ రెస్టారెంట్ యాజమాన్యాల పరిస్థితి ఇదే, కోట్లు గుమ్మరిస్తున్నాం, అంతోటి మద్యం వ్యాపార లావాదేవీలు జారుతాయా లేదా? అన్నది పక్కన పెట్టి, నిబంధనలకు తూట్లు పొడిస్తే అంతకు అంత ఆదాయం మన సొంతం అన్న చందంగా అధికారులను సైతం మభ్యపెట్టి అటు ప్రత్యక్షంగా, ఇటు పరోక్షంగా రాష్ట్ర మద్యం అమ్మకాలను పెంచుతూ, తమ లాభార్జన గావించుతున్న మనసున్న మహారాజులు ప్రొద్దుటూరులోని కొన్ని బార్ల యజమానులు. ఇకనైనా నామమాత్రపు చర్యలకైనా అధికారులు ఉపక్రమిస్తే సంబంధిత శాఖ ఒకటి ఉన్నది అని ప్రజలకు తెలుస్తుంది అన్నది పలువురు ప్రజల అభిప్రాయం. నశేషం... వ్యంగాస్త్రం...
Comments