సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో మీ ముందుకు... అధికారుల మొద్దు నిద్ర, తెల్లవారుజామునుండే ఎదేచ్చగా బార్లలో మద్యం అమ్మకాలు...
ప్రొద్దుటూరు పట్టణం లో బార్ యాజమాన్యాలు యథేచ్ఛగా విచ్చలవిడిగా తెల్లవారుజామునే అమ్మకాలు చేస్తున్నారు. నగరంలోని బార్ లను ఉదయం ఐదు గంటలకే తెరిచి అడ్డా కూలీలు, సామాన్యులే టార్గెట్ గా విక్రయాలు కొనసాగిస్తున్నరు. ఉదయం బార్ లు తెరచుకోగానే మద్యం ప్రియులు క్యు కడుతున్నారు . నిబంధనల ప్రకారం ఉదయం 10 గంటలకు తెరుచుకోవాల్సిన బార్ లు తెల్లవారుజామున 5 గంటలకే తెరుస్తూ పబ్లిక్ గా మద్యం విక్రయాలు చేస్తున్నారు. రాత్రి 11 గంటలకు మూత వేయాల్సిన బార్ లు అర్ధరాత్రి ఒంటిగంట అవుతున్న మూయకుండా విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుపుతున్నారు. ముఖ్యంగా ప్రొద్దుటూరులోని గోసుల బార్, పీకాక్ బార్ ,వీరభద్ర బార్, ప్యారడైజ్ బార్లు ఆదాయమే మార్గంగా నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న బార్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత శాఖ అధికారులు ఆ వైపు కనీసం కనెత్తి చూడటం లేదు.
Comments