ధనుష్ ను పరామర్శించిన బత్యాల
ప్రసన్న ఆంధ్ర, రాజంపేట
పిచ్చికుక్క కరిచి తీవ్రంగా గాయపడి తిరుపతిలో హేలియోస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎల్ కే జి చదువుతున్న ధనుష్ అనే బాలుడిని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజంపేట ఇన్చార్జి బత్యాల చెంగల రాయుడు పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చారు. ఈ సందర్భంగా బత్యాల మాట్లాడుతూ ఈ ఘటనకు పూర్తి నైతిక బాధ్యత మున్సిపల్ చైర్ పర్సన్ దేనని అన్నారు. మున్సిపల్ కమిషనర్ మానవతా దృక్పథంతో వ్యవహరించారని, వెంటనే స్పందించి బాలుడిని తిరుపతికి తరలించి వైద్యం అందించడంలో సహాయ సహకారాలు అందించారని అన్నారు.
మండలంలో కుక్కల బెడద తీవ్రంగా ఉందని.. ఇటీవల మంద పల్లె హరిజనవాడకు చెందిన నిరుపేద దళితుడు చంద్ర కు సంబంధించిన 15 గొర్రెలను కుక్కలు అతి దారుణంగా చంపాయని గుర్తు చేశారు. నేడు మళ్లీ ఉపాధ్యాయుడు కుక్కకాటుకు గురవడం బాధాకరమని అన్నారు. పురపాలకులు, పంచాయితీ పాలకులు ప్రజలను కుక్కల బారి నుంచి రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. వెంటనే ఇందుకు సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేసి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డి, కోట శంకర్, సింగనమల నాగార్జున, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Comentarios