చేప మందు పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ మృతి
హైదరాబాద్‌లోని పాతబస్తీలో నివాసముంటున్న బత్తిని హరినాథ్ గౌడ్ తన నివాసంలోనే తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా హరినాథ్ గౌడ్ అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో బుధవారం రాత్రి మరణించారు. బత్తిని హరినాథ్ గౌడ్ అనగానే చేప మందు గుర్తుకు వస్తుంది. కొద్ది రోజుల క్రితం అంటే మృగశిర కార్తె సందర్భంగా ఆయన చేపమందు పంపిణీ చేశారు. నేటి సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.
బత్తిని హరినాథ్ గౌడ్ సోదరులు గత కొన్నేళ్లుగా చేప మందు పంపిణీ చేస్తున్నారు. హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ప్రతి సంవత్సరం బత్తిని సోదరులు ఇచ్చే చేప మందు కోసం దేశ వ్యాప్తంగా ఆస్తమా రోగులు వేల సంఖ్యలో తరలి వస్తుంటారు. కాగా.. బత్తిని హరినాథ్ గౌడ్ కు భార్య సునిత్రదేవి, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. పాత బస్తీ లోని దూద్ బౌలి ప్రాంతానికి చెందిన బత్తిని సోదరులు ఐదుగురు శివరాం, సోమ లింగం, విశ్వనాథ్, హరినాథ్ గౌడ్, ఉమా మహేశ్వర్.1983 సంవత్సరంలో పాత బస్తీ దూద్ బౌళి నుంచి భోలక్ పూర్ పద్మశాలి కాలనీకి నివాసం మార్చారు.
Yorumlar