జాతీయ బీసీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మహిళా బిల్లులో బీసీ మహిళలకు రాజకీయాలలో 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని బీసీ సమాఖ్య రాష్ట్ర జనరల్ సెక్రెటరీ బడబాగ్ని వెంకటరమణ రాజు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం కడప జిల్లా యందు ఏర్పాటు చేశామని ఇందుకుగాను విజయవాడ రాష్ట్ర జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు డాక్టర్ వెంగళరావు ఆధ్వర్యంలో బీసీ సమాఖ్య కు చెందిన పలువురు సభ్యులకు వివిధ హోదాలు కల్పించామని తెలిపారు. ఇందులో భాగంగా, రాష్ట్ర బీసీ సమాఖ్య జనరల్ సెక్రటరీగా బడబాగ్ని వెంకట రమణ రాజు, ప్రధాన కార్యదర్శిగా కత్తి విజయ్ కుమార్ లను నియమించినట్లు, కడప జిల్లా గౌరవాధ్యక్షులుగా సందు శివ నారాయణ, రామేశ్వరం ప్రభు కుమార్, జిల్లా కన్వీనర్ గా బడబాగ్ని వెంకటరమణ రాజు, ప్రధాన కార్యదర్శిగా జింక రాజశేఖర్, ఉపాధ్యక్షులుగా జింక జయప్రకాష్, పాలగిరి సుధాకర్ రాజు, సంయుక్త కార్యదర్శి రమేష్ రాజు లను నియమించినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో బీసీ సమాఖ్య రాష్ట్ర జిల్లా ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments