బీసీలకు టిడిపి పట్టణ అధ్యక్షులుగా ప్రాధాన్యత కల్పించాలి - బిసి ప్రజా చైతన్య సమాఖ్య
కడప జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అధిక శాతం జనాభా గల బీసీలకు టిడిపి పట్టణ అధ్యక్షులుగా ప్రాధాన్యత కల్పించాలని బిసి ప్రజా చైతన్య సమాఖ్య కార్యాలయంలో బీసీల అంతా కలిసి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి తో పాటు రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకులకు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. మంగళవారం స్థానిక బిసి ప్రజా చైతన్య సమాఖ్య కార్యాలయంలో అధ్యక్షులు బొర్ర రామాంజనేయులు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 60 శాతం పైగా బీసీలు ఉన్నారని, ప్రతిసార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపుకు కృషి చేస్తున్నారన్నారు. కానీ గత కొన్నేళ్లుగా తెలుగుదేశం పార్టీ పదవులలో బీసీలకు ప్రాధాన్యత కరువైందన్నారు. బీసీలలో మరింత రాజకీయంగా చైతన్యం కల్పించేందుకు తెలుగుదేశం పార్టీలో సముచితమైన పదవి అవసరమని గుర్తించాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. మా విన్నపాన్ని పరిశీలించి పట్టణ అధ్యక్ష పదవి బీసీలకు కేటాయించాలని కోరారు. బీసీలకు ఈ అవకాశం కల్పిస్తే బీసీలలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసే అవకాశం ఉందని తెలిపారు. కావున పార్టీ అధిష్టానం పట్టణ అధ్యక్షులు నియమించడంలో సరైన నిర్ణయం తీసుకుంటారని ఆకాంక్షించారు.
ప్రొద్దుటూరు టిడిపి అభ్యర్థిని గెలిపించేందుకు బీసీలంతా ఏకమై కష్టపడి పని చేసి ప్రొద్దుటూరులో టిడిపి జెండా ఎగరవేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లబోతుల నాగరాజు, కడప జిల్లా అధికార ప్రతినిధి ఆవుల దస్తగిరి, దేవాంగ సాధికార కమిటీ సభ్యుడు మధు, పాణ్యం సుబ్బరాయుడు, జిసి పుల్లయ్య, గిద్దలూరు మల్లికార్జున, దస్తగిరి, రామకృష్ణ, గోపవరం రమణ, సిద్దయ్య, సంటయ్య పాల సుబ్బరాయుడు మరియు బిసి ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comentarios