యోగివేమన విశ్వవిద్యాలయం బీఈడీ మొదటి, మూడవ సెమిస్టర్ల ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం వైస్ చాన్సలర్ ఆచార్య మునగాల సూర్యకళావతి, రిజిస్ట్రార్ ఆచార్య డి. విజయ రాఘవప్రసాద్, పరీక్షల నియంత్రణాధి కారి డాక్టర్ ఎన్. ఈశ్వరరెడ్డిలు ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా డా. ఈశ్వరరెడ్డి మాట్లాడుతూ బీఈడీ ప్రథమ సెమిస్టర్ కు 1609 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 1493 మంది ఉత్తీర్ణత సాధించి 92. 79 శాతం ఫలితాలు వచ్చాయన్నారు. మూడవ సెమిస్టర్ కు 1946 మంది విద్యార్థులు హాజరుకాగా 1916 మంది ఉత్తీర్ణత సాధించి 98. 46 శాతం ఫలితాలు వచ్చాయన్నారు. కార్యక్రమంలో పరీక్షల విభాగం సహాయ నియంత్రణ అధికారులు డా. వరప్రభాకర్, డా. ఆదినారాయణరెడ్డి పాల్గొన్నారు.
top of page
bottom of page
Коментарі