బీరం శ్రీధర్ రెడ్డి కళాశాలమరో మారు ర్యాంకుల పరంపర
నేడు విడుదలైన జేఈఈ అడ్వాన్స్డ్ 2023 ఫలితాల్లో బీరం కళాశాల విద్యార్థి వి. ఓబుల్ రెడ్డి ఆల్ ఆలిండియా స్థాయిలో 47వ ర్యాంకు సాధించి ప్రభంజనం సృష్టించాడు. పరీక్ష రాసిన 12 మందిలో ఎనిమిది మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించి దేశంలోని వివిధ ఐఐటి కళాశాలలలో సీట్లు సాధించడం కళాశాలకు గర్వ కారణం అని ఈ సందర్భంగా బీరం శ్రీధర్ రెడ్డి కళాశాల అధినేత బీరం సుబ్బారెడ్డి, చైర్పర్సన్ సరస్వతమ్మ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొన్న ఎంసెట్, నిన్న నీట్ - 2023, నేడు జేఈఈ - అడ్వాన్స్డ్ లో మా విద్యార్థులు ర్యాంకులు సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు. స్థాపించిన మొదటి సంవత్సరంలోనే ఇలా వరుస విజయాలు సాధించడం ఒక బీరం శ్రీధర్ రెడ్డి కళాశాలకే సాధ్యమని తెలియజేశారు. ర్యాంకు సాధించిన విద్యార్థులను అభినందించారు.
జాతీయ స్థాయిలో విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించడానికి ఎంతో డబ్బులు వెచ్చించి అనుభవజ్ఞులు, అంకితభావం కలిగిన అధ్యాపకులను నియమించామని, అందమైన ప్రకృతి, అద్భుతమైన ఆలోచనల ఆకృతి అని నమ్మి బీరం శ్రీధర్ రెడ్డి కళాశాల భవనాన్ని నిర్మించి విద్యార్థులు చక్కటి ప్రశాంతకరమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను అభ్యసించే అవకాశం కల్పించి, పిల్లల భవిష్యత్తు కొరకు అహర్నిశలు కష్టపడే యాజమాన్యం మాది అని, విద్యార్థులు బంగారు భవిష్యత్తే తమ సంస్థ భవిష్యత్తు అని నమ్మి హై స్కూల్ స్థాయి నుండే ఒక నిర్దిష్ట ప్రణాళికతో జేఈఈ -మెయిన్స్, నీట్ వంటి జాతీయ స్థాయి పరీక్షలకు చక్కటి ఫౌండేషన్ శిక్షణ ఇస్తున్నామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. బీరం శ్రీధర్ రెడ్డి పాఠశాలలో, కళాశాలలో చదివిన విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నతమైన స్థానంలో ఉంటారని వారు చెప్పారు.
బీరం శ్రీధర్ రెడ్డి కళాశాల డైరెక్టర్ స్వాతి శ్రీకాంత్ మాట్లాడుతూ జేఈఈ - అడ్వాన్సుడ్ లో ర్యాంకు సాధించడం అంటే చాలా కష్టతరమని అంతటి కష్టాన్ని చేదించి ర్యాంక్ సాధించిన ఘనత మా కళాశాలదే అని పేర్కొన్నారు. అలాగే జేఈఈ మెయిన్స్, నీట్ వంటి కోర్సులలో శిక్షణ పొందేందుకు బీరం శ్రీధర్ రెడ్డి కళాశాల ఒక వేదిక అని, ఈనెల 19వ తేదీ నుండి నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను వారు అభినందించారు.
ఈ కార్యక్రమంలో బీరం శ్రీధర్ రెడ్డి పాఠశాల ప్రిన్సిపల్ శ్వేతా, కళాశాల ప్రిన్సిపల్ హేమ్ చందర్, అధ్యాపకులు పాల్గొన్నారు.
تعليقات