శ్రీధర్ రెడ్డి ఇంటర్నేషనల్ స్కూల్ గుర్తింపును రద్దు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేసిన హైకోర్టు
ఇటీవల కడప జిల్లా శ్రీధర్ రెడ్డి ఇంటర్నేషనల్ పాఠశాలలో హాస్టల్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటనలో యాజమాన్యాన్ని బాధ్యత చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి పాఠశాల గుర్తింపు రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించిన యాజమాన్యం. ముందస్తు నోటీస్ ఇవ్వకుండా పాఠశాల గుర్తింపు రద్దు చేయడం చట్ట వ్యతిరేకమని, యాజమాన్యం తరపున న్యాయవాది మతుకుమిల్లి శ్రీవిజయ్ వాదనలు వినిపించారు.
విద్యాశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది వాదించగా.. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు DEO ఇచ్చిన ఉత్తర్వులు చట్ట వ్యతిరేకమని నిర్ధారిస్తూ కొట్టి వేసింది.
Comments