top of page
Writer's picturePRASANNA ANDHRA

బిచ్చగాడి గొప్ప మనసు.. వేల రూపాయలు విరాళం

బిచ్చగాడి గొప్ప మనసు..

వేల రూపాయలు విరాళం


ఎన్ని కోట్లు సంపాదించినా పిల్లికి కూడా భిక్షం పెట్టని వాళ్లున్న సమాజంలో బిచ్చం ఎత్తుకుంటూ కొన్ని వేల రూపాయలను విరాళంగా ఇచ్చాడు విశాఖపట్నానికి చెందిన ఓ బిచ్చగాడు. అతడి మంచి మనసును అర్థం చేసుకున్న వాళ్లంతా శభాష్ అని మెచ్చుకుంటున్నారు. తను మరో నలుగురికి ఆదర్శమంటూ కితాబిస్తున్నారు. భిక్షాటన చేస్తూ జీవిస్తున్న ఆ వ్యక్తి.. తన భవిష్యత్ గురించి ఆలోచించకుండా తన సంపాదనలో కొంత మొత్తాన్ని దానం చేస్తుండేవాడు.

యాచకుడి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన పురంధర్‌ 14 ఏళ్ల క్రితం విశాఖ నగరానికి వలస వచ్చాడు. అప్పటి నుంచి నక్కవానిపాలెంలోని ఉమా నీలకంఠేశ్వర స్వామి ఆలయం వెనుక ఉన్న స్నానాల గదినే నివాసంగా మార్చుకుని జీవితాన్ని గడుపుతున్నాడు. తన పొట్ట నింపుకునేందుకు ఆ ఆలయం వద్దనే భిక్షాటన చేస్తున్నాడు.


తన దుస్తులతో పాటు తాను సంపాదించిన నగదును కూడా ఆ బాత్ రూమ్ లోనే దాస్తుంటాడు. అయితే ఇటీవల ఆలయ పూజారి బాత్ రూమ్ లో ఉన్న పురంధర్‌ బట్టలను ఇతర సామాగ్రిని బయటకు విసిరేశాడు. మూటలో ఉన్న నగదు చెల్లాచెదురుగా పడిపోయింది. అలా పడిన డబ్బులను చూసి పూజారి సహా అక్కడ ఉన్నవారు షాక్ తిన్నారు. వెంటనే ఆలయ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారులు యాచకుని ఆరా తీశారు. దీంతో పురంధర్‌ దగ్గర ఉన్న డబ్బులు భక్తులు ధర్మం చేసిందేనని తేలింది. మొత్తాన్ని లెక్కించగా లక్ష రూపాయలకు పైగానే ఉంది. దీంతో పురంధర్‌ అందులోని సగం సొమ్మును స్వామి వారికి విరాళంగా సమర్పించుకున్నాడు. రూ. 50 వేల విలువైన నాణేలను హుండీలో వేశారు. మిగిలిన సగం తనకు అనారోగ్యం చేస్తే వైద్య ఖర్చుల కోసం దాచుకుంటానని వెల్లడించాడు.

76 views0 comments

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page