పచ్చి కొబ్బరితో ఉపయోగాలివే
1. పచ్చి కొబ్బరిని తినడం వల్ల మలబద్దకం సమస్య నుంచి బయట పడవచ్చు. ఎందుకంటే కొబ్బరిలో 61 శాతం మేర ఫైబర్ ఉంటుంది. కూరగాయలు, ఇతర పదార్థాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. కనుక మన శరీరానికి పుష్కలంగా ఫైబర్ లభిస్తుంది. దీంతో మలబద్దకం సమస్య ఉండదు. జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. పేగుల్లో కదలికలు బాగుంటాయి. సుఖ విరేచనం అవుతుంది.
2. పచ్చి కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి. చర్మంలో తేమ ఉండేలా చూస్తాయి. దీంతో చర్మం పొడిబారడం తగ్గుతుంది. చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా కనిపిస్తుంది. అలాగే కొబ్బరిలో మోనోలారిన్, లారిక్ యాసిడ్లు ఉంటాయి కనుక అది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఏజెంట్గా పనిచేస్తుంది. దీంతో మొటిమలు తగ్గుతాయి. జుట్టు కుదుళ్లు దృఢంగా మారుతాయి. చుండ్రు సమస్య ఉండదు. కొబ్బరిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కణాలను దెబ్బ తినకుండా చూస్తాయి. దీంతో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
3. అధిక బరువు తగ్గాలనుకునే వారు రోజూ పచ్చి కొబ్బరిని ఆహారంలో భాగం చేసుకోవాలి. పచ్చికొబ్బరిని తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.
Комментарии